అప్పుడు తండ్రితో, ఇప్పుడు కొడుకుతో... విండీస్‌తో మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు...

Published : Jul 12, 2023, 08:31 PM IST

ఫామ్‌లో ఉన్నా, లేకున్నా విరాట్ కోహ్లీ ఖాతాలో రికార్డులు వచ్చి పడుతూనే ఉన్నాయి. తాజాగా వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా డొమినికాలో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కే సాధ్యమైన మరో రికార్డును సమం చేశాడు..  

PREV
15
అప్పుడు తండ్రితో, ఇప్పుడు కొడుకుతో... విండీస్‌తో మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు...

2011లో వెస్టిండీస్ పర్యటనలో టెస్టు ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ, ఆ సమయంలో విండీస్ గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకడైన శివ్‌నరైన్ చంద్రపాల్‌ సభ్యుడిగా ఉన్న టీమ్‌తో ఆడాడు..  ఇప్పుడు, 12 ఏళ్ల తర్వాత చంద్రపాల్ కొడుకు టగెనరైన్ చంద్రపాల్‌తో ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ..

25

ఇలా విదేశాల్లో తండ్రీ, కొడుకులతో కలిసి టెస్టు మ్యాచ్ ఆడిన రెండో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్‌కి మాత్రమే ఈ రికార్డు సాధ్యమైంది. 1992లో ఆస్ట్రేలియా క్రికెటర్ జోఫ్ మార్ష్‌తో టెస్టు ఆడిన సచిన్ టెండూల్కర్, 2011 ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన కొడుకు షాన్ మార్ష్‌తో కలిసి మ్యాచ్ ఆడాడు..

35
Image credit: PTI

1992 ఆస్ట్రేలియా పర్యటనలో జోఫ్ మార్ష్ ఆఖరి టెస్టులో ఆడిన సచిన్ టెండూల్కర్, షాన్ మార్ష్, టీమిండియాతో ఆడిన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌లోనూ సభ్యుడిగా ఉండడం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇదే సచిన్‌కి ఆఖరి విదేశీ పర్యటన కూడా..

45

ఓవరాల్‌గా రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ కూడా శివ్‌నరైన్ చంద్రపాల్‌‌తో మ్యాచులు ఆడారు. అయితే వెస్టిండీస్‌లో మ్యాచులు ఆడకపోవడంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. 

55

తొలి టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన టగెనరైన్ చంద్రపాల్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టు క్రికెట్‌లో తండ్రీ కొడుకులను అవుట్ చేసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories