ద్రావిడ్, లక్ష్మణ్, సచిన్ నన్ను కలిసి సలహలు అడిగేవాళ్లు! ఈతరంలో ఎవ్వరికీ ఆ గౌరవం లేదు.. - సునీల్ గవాస్కర్

Published : Jul 12, 2023, 06:49 PM IST

టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్ సునీల్ గవాస్కర్. గవాస్కర్ రిటైర్ అయ్యే సమయానికి క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు అతని పేరిట ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఫెవరెట్ క్రికెటర్ కూడా సన్నీయే..

PREV
17
ద్రావిడ్, లక్ష్మణ్, సచిన్ నన్ను కలిసి సలహలు అడిగేవాళ్లు! ఈతరంలో ఎవ్వరికీ ఆ గౌరవం లేదు.. - సునీల్ గవాస్కర్
Sunil Gavaskar

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత భారత జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు సునీల్ గవాస్కర్. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న సునీల్ గవాస్కర్, రంజీల్లో బాగా ఆడుతున్న ప్లేయర్లను సెలక్ట్ చేయకపోతే ఇక ఆ టోర్నీ నిర్వహించడం ఎందుకని ఫైర్ అయ్యాడు..

27

తాజాగా మరోసారి టీమిండియా ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్. ‘సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి క్రికెటర్లు ఆడే సమయంలో తరుచుగా నన్ను కలిసి సలహాలు, సూచనలు అడుగుతుండేవాళ్లు...

37

వాళ్ల బ్యాటింగ్ చూసి ఏమైనా లోపాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ ఉండేవాళ్లు. సీనియర్లకు అంత గౌరవం ఇచ్చేవాళ్లు. నేటితరంలో సీనియర్లంటే అలాంటి గౌరవం లేదు. ప్రస్తుత భారత జట్టులో ఏ క్రికెటర్ కూడా నా దగ్గరకి రాలేదు..

47

వీరేంద్ర సెహ్వాగ్ ఫామ్ కోల్పోయి, టీమిండియా నుంచి తొలగించాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో వీరూని కలిశాను. ఆఫ్ స్టంప్ గార్డ్ ప్రయత్నించమని సలహా ఇచ్చాను. దానికి వీరూ ‘ఎందుకు సన్నీ భాయ్’ అని అడిగాడు.. 

57

‘చూడు నీ ఫుట్‌వర్క్ అస్సలు బాలేదు. నువ్వు పరుగులు చేయలేకపోవడానికి అదే కారణం. ఆఫ్ స్టంప్ గార్డ్‌ వేసుకుని ప్రయత్నిస్తే నీకు ఆఫ్ స్టంప్ అవతలకి వెళ్తున్న బంతుల గురించి క్లియర్ ఐడియా వస్తుంది. ఎవ్వరైనా బ్యాటర్ చేసిన తప్పులనే మళ్లీ మల్లీ చేస్తుంటే, అతని టెక్నిక్‌ని సరిచేయాల్సిన బాధ్యత కోచ్‌పైన ఉంటుంది.
 

67

అయితే టీమిండియాలో అలాంటిది జరుగుతున్నట్టు కనిపించడం లేదు. బ్యాటర్లను మరింత మెరుగ్గా చేయడానికి కోచింగ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారా? ఎక్కడ తప్పు జరుగుతోంది? ఏది సరిచేసుకోవాలనే విషయాన్ని చెప్పి చూశారా?

77
Sunil Gavaskar

కోచ్‌ ఎప్పుడూ క్లియర్‌గా ఉండాలి. సీనియర్ అయినా, జూనియర్ అయినా ప్రతీ ప్లేయర్ కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. టెక్నిక్‌ని మెరుగుపర్చుకుంటూనే ఉండాలి. అలాగని కోచ్‌లు ఉన్న తెలివినంతా వాళ్లపైనే రుద్దే ప్రయత్నం చేయకూడదు..’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..

click me!

Recommended Stories