విరాట్ ఒక్కడు, ఎవ్వరికీ అందనంత ఎత్తున... ఐసీసీ అవార్డులపై పేలుతున్న జోక్స్...

Sreeharsha Gopagani | Published : Dec 29, 2020 5:59 AM
Google News Follow Us

ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ప్రకటించిన దశాబ్దపు పురస్కారాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా టీ20 మెన్స్ టీమ్‌పై, అలాగే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌గా ఎంపికైన రషీద్‌ ఖాన్‌పై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ దశాబ్దంలోనే అత్యధికంగా ఐసీసీ అవార్డులు పొందిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర క్రియేట్ చేశాడు. 

112
విరాట్ ఒక్కడు, ఎవ్వరికీ అందనంత ఎత్తున... ఐసీసీ అవార్డులపై పేలుతున్న జోక్స్...

2011 నుంచి 2020 మధ్య దశాబ్దకాలంలో  భారత క్రికెటర్లు 18 ఐసీసీ అవార్డులు కైవసం చేసుకుని, మిగిలిన దేశాల కంటే టాప్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా 15 ఐసీసీ అవార్డులతో రెండో స్థానంలో ఉంది.

212

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వెస్టిండీస్ క్రికెటర్లకి ఒక్కో ఐసీసీ అవార్డు రాగా, ఈ దశాబ్దంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎవ్వరూ ఐసీసీ అవార్డు పొందలేకపోయారు. 

312

ఈ దశాబ్దంలో మొత్తం 8 ఐసీసీ అవార్డులు కైవసం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా మినహా మిగిలిన క్రికెట్ దేశాలేవీ కూడా మొత్తంగా ఇన్ని అవార్డులను సొంతం చేసుకోలేకపోయాయి. సౌతాఫ్రికా 7, ఇంగ్లాండ్ 6, శ్రీలంక నాలుగేసి అవార్డులను పొందాయి.

Related Articles

412

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేట్‌గా ఎంపికైన విరాట్ కోహ్లీ... 2012, 2017, 2018 సంవత్సరాల్లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందాడు...

512

అలాగే 2017, 2018 సంవత్సరాల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం సొంతం చేసుకున్న కోహ్లీ, 2018లో ఐసీసీ టెస్టు ప్లేయర్ అవార్డు గెలిచాడు.

612

ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేట్‌గా ఎంపికైన విరాట్ కోహ్లీ, 2019లో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.

712

వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ... ఐసీసీ వన్డే, టెస్టు, టీ20 కెప్టెన్‌గా 8సార్లు నిలిచాడు. ధోనీ మాత్రమే (9సార్లు) కోహ్లీ కంటే ముందున్నాడు.

812

అయితే ఆఫ్ఘాన్ ప్లేయర్ ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది డికేట్‌గా ఎంపిక కావడంపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

912

2011 నుంచి 2020 మధ్య ప్రదర్శన ఆధారంగా అవార్డులను ప్రకటించింది ఐసీసీ. అయితే లెక్క ప్రకారం ఈ దశాబ్ద ప్రారంభంలో రషీద్ ఖాన వయసు కేవలం 12 ఏళ్లు... క్రికెట్ ఎంట్రీ కూడా ఇవ్వలేదు.

1012

అలాగే కుమార సంగర్కరకి టెస్టు జట్టులో వికెట్ కీపర్‌గా ఎంపిక చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. 2015లో రిటైర్మెంట్ ప్రకటించిన కుమార సంగర్కర... ఈ దశాబ్దంలో పెద్దగా మ్యాచులు ఆడింది లేదు. మరి అతనికి ఎలా ఐసీసీ జట్టులో చోటు దక్కిందని ప్రశ్నిస్తున్నారు పాక్ అభిమానులు.

1112

అంతేకాకుండా టీ20 జట్టులో బౌలర్లుగా రషీద్ ఖాన్, బుమ్రా, లసిత్ మలింగలను ఎంపిక చేసిన ఐసీసీ, ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్‌, మ్యాక్స్‌వెల్‌కి చోటు ఇచ్చింది. ముగ్గురు బౌలర్లకి మాత్రమే జట్టులో చోటు ఇవ్వడంపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

1212

పాక్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్, పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్, పాక్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌లకి ఐసీసీ ఎందుకు పక్కనబెట్టిందని విమర్శిస్తున్నారు. 

Recommended Photos