క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌గా కోహ్లీ... టెస్టు ప్లేయర్‌గా స్టీవ్ స్మిత్, ధోనీకి స్పిరిట్ అవార్డు...

First Published Dec 28, 2020, 4:45 PM IST

ఐసీసీ అవార్డుల్లో విరాట్ కోహ్లీ హవా చూపించాడు. నిన్న ప్రకటించిన టీమ్ అవార్డుల్లో వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.... నేడు ప్రకటించిన డికేట్ ప్లేయర్ల అవార్డుల్లోనూ రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు. విరాట్‌తో పాటు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కూడా స్పిరిట్ అవార్డు దక్కింది.

ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేట్... విరాట్ కోహ్లీ
undefined
2011 నుంచి 2020 వరకూ 39 వన్డే సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ 61.83 సగటుతో పరుగులు సాధించాడు. 112 క్యాచులు అందుకున్నాడు..
undefined
ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది డికేట్... రషీద్ ఖాన్
undefined
ఆఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్... 89 వికెట్లు తీసుకుని, మూడు సార్లు నాలుగేసి వికెట్లు, రెండు సార్లు ఐదేసి వికెట్లు సాధించాడు.
undefined
ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది డికేట్... స్టీవ్ స్మిత్
undefined
ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గత దశాబ్ద కాలంలో 7040 టెస్టు పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
undefined
ఐసీసీ మేల్ క్రికెటర్ ఆఫ్ ది డికేట్... విరాట్ కోహ్లీ
undefined
గత దశాబ్దకాలంలో అత్యధికంగా 20,396 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 66 సెంచరీలు, 94 హాఫ్ సెంచరీలు చేసి సంచలనం క్రియేట్ చేశాడు.
undefined
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు... మహేంద్ర సింగ్ ధోనీ
undefined
2011లో నాటింగ్ఘమ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రనౌట్ అయిన ఇయాన్ బెల్‌ను తిరిగి పిలిచి, క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ.
undefined
ఐసీసీ వుమెన్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది డికేట్...
undefined
మహిళల విభాగంలో మూడు అవార్డులను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియా ప్లేయర్ ఎలీసీ పెర్రీ.
undefined
టీ20ల్లో 1155 పరుగులు, 89 వికెట్లు తీసి... టీ20 వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌గా నిలిచిన పెర్రీ, వన్డేల్లో 2621 పరుగులు,98 వికెట్లతో వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌ అవార్డు సొంతం చేసుకుంది.
undefined
మొత్తంగా 4349 పరుగులు, 213 వికెట్లతో పాటు నాలుగుసార్లు టీ20 వరల్డ్‌కప్, ఓ సారి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన పెర్రీ, మహిళల అవార్డులను క్లీన్ స్వీప్ చేసింది.
undefined
click me!