కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు... అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన...

First Published Mar 14, 2021, 9:37 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. కెప్టెన్‌గా 12 వేల పరుగులు చేసిన మూడో సారథిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, సౌతాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ మాత్రమే విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేశారు. 

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 11,207 పరుగులు చేయగా, కెప్టెన్‌గా మూడు ఫార్మట్లలో కలిపి 12 వేల పరుగులు చేసిన మొట్టమొదటి భారత సారథిగా నిలిచాడు విరాట్ కోహ్లీ...
undefined
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన కెరీర్‌లో కెప్టెన్‌గా 15,440 పరుగులు చేసి టాప్‌లో ఉండగా, సఫారీ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 14,878 పరుగులు చేశాడు. కోహ్లీ 12 వేల పరుగులు చేయగా ఆండ్రూ ఫ్లెమ్మింగ్ 11561, ధోనీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
undefined
అత్యంత వేగంగా కెప్టెన్‌గా 12 వేల మైలురాయిని అందుకున్న సారథిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. రికీ పాంటింగ్ 282 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా, గ్రేమ్ స్మిత్ 293 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. విరాట్ కోహ్లీ మాత్రం 226 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు..
undefined
మొదటి ఓవర్‌ మెయిడిన్ ఆడి డకౌట్ అవ్వడం కెఎల్ రాహుల్‌కి ఇది రెండోసారి. ఇంతకుముందు 2016లో ఇలాగే తెండై చెతారా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్...
undefined
6 బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్. గత మ్యాచ్‌లో ఐదు బంతులాడి విరాట్ కోహ్లీ డకౌట్ అవ్వడమే రికార్డుగా ఉండేది...
undefined
click me!