కొన్నాళ్లుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీ, రెండు మ్యాచుల్లో కలిపి 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ కంటే ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లను ఆడిస్తే బెటర్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయ్యింది...
27
పరుగులు చేయలేక భారత జట్టుకి భారంగా మారుతున్న విరాట్ కోహ్లీని తానైతే తుది జట్టులోకి తీసుకోనని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కామెంట్ చేశాడు. భారత మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, పార్ధివ్ పటేల్ కూడా టీ20ల్లో విరాట్ కోహ్లీకి చోటు ఇవ్వడం అనవసరమంటూ వ్యాఖ్యానించారు...
37
తాజాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం విరాట్ కోహ్లీకి మద్ధతుగా నిలిచాడు. ‘విరాట్ కోహ్లీ పరుగులు చేసినా చేయకపోయినా అతనికి టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు ఉండాలి. ఎందుకంటే టీమ్‌లో కోహ్లీ ఉంటే ఆ ఎనర్జీయే వేరుగా ఉంటుంది...
47
Image credit: Getty
విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, జట్టులో ఉన్న మిగతా ప్లేయర్లు కూడా పరుగులు చేయలేకపోతున్నారు. రోహిత్ శర్మ ఈ ఏడాది ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దానికేమంటారు. రోహిత్ ఫామ్ గురించి ఎవ్వరూ మాట్లాడరేం...
57
Sunil Gavaskar
విరాట్ కోహ్లీ ఫామ్ కంటే ప్లేయర్‌గా అతని అవసరం టీమ్‌కి చాలా ఉంది. ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మినెంట్...’ అంటూ వ్యాఖ్యానించాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
67
‘బయటి వ్యక్తులు ఏం అనుకుంటున్నారో మేం పట్టించుకోం. ఎందుకంటే ఎక్స్‌పర్ట్స్ ఏం అనుకుంటున్నారో మాకు అనవసరం. అసలు వారిని ఎక్స్‌పర్ట్ అని ఎందుకు పిలుస్తారో కూడా నాకు అర్థం కాదు...
77
ప్రతీ ఒక్క ప్లేయర్‌కి ఇలాంటి పరిస్థితి వస్తుంది. నేను కూడా ఇలాంటి టైమ్ ఫేస్ చేశాను. కానీ కొన్ని ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్న ప్లేయర్ సత్తా ఏంటో మాకు తెలుసు. ఒక్క సిరీస్‌లో ఆడలేదని, లేదా కొన్ని నెలలుగా ఆడడం లేదని అతన్ని పక్కనబెట్టలేం...’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...