చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి 19 ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది ఆర్‌సీబీ. ఆఖరి ఓవర్ సజావుగా సాగి ఉంటే నిర్ధిష్ట సమయం కంటే ముందే సీఎస్‌కే ఇన్నింగ్స్ ముగిసేది...
అయితే హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్‌లో రవీంద్ర జడేజా సిక్సర్ల సునామీ క్రియేట్ చేశాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదడం, అందులో ఓ బాల్ నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ రావడం... ఆ తర్వాత రెండు పరుగులు, బౌండరీ, సిక్సర్... ఇలా మొత్తంగా 37 పరుగులు రాబట్టాడు రవీంద్ర జడేజా..
జడ్డూ సిక్సర్లు బాదుతుంటే, అతన్ని ఎలా ఆపాలో తెలియక ఆ ఓవర్ ఫినిష్ చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు బౌలర్ హర్షల్ పటేల్, ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ విరాట్ కోహ్లీ. ఫలితంగా పుణ్యకాలం గడిచిపోవడం, ఫైన్ పడడం జరిగింది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదట ఫైన్ కట్టిన కెప్టెన్‌గా నిలిచాడు సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి రూ.12 లక్షల ఫైన్ పడింది. ఆ తర్వాతి మ్యాచ్‌ను కేవలం 88 నిమిషాల్లోనే ముగించాడు ధోనీ.
ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ సారథి ఇయాన్ మోర్గాన్‌లకు కూడా స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12 లక్షల జరిమానా పడింది...
షెడ్యూల్ సమయానికి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్ల కోటా పూర్తిచేయకపోతే మొదటి సారి రూ.12 లక్షల జరిమానా విధిస్తారు ఐపీఎల్ యాజమాన్యం. మళ్లీ రిపీట్ అయితే రెట్టింపు అవుతుంది. మూడోసారి కూడా రిపీట్ అయితే ఫైన్‌తో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు.
వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి విజయోత్సాహంతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకి చెన్నై సూపర్ కింగ్స్ బ్రేకులు వేసిన విషయం తెలిసిందే.