మనీశ్ పాండేని పక్కనబెట్టడం నాకిష్టం లేదు... అంతా వాళ్లే చేశారు... డేవిడ్ వార్నర్ కామెంట్...

First Published Apr 26, 2021, 4:31 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ‘సూపర్ ఓవర్’ మ్యాచ్‌లో ఓటమి పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఎన్నో సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వేధిస్తున్న మిడిల్ ఆర్డర్ సమస్య, మరోసారి నిన్నటి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. అయితే సీనియర్ ప్లేయర్ మనీశ్ పాండే ఉండి ఉంటే, సన్‌రైజర్స్ గెలిచి ఉండేదని అభిప్రాయపడుతున్నారు కొందరు ఫ్యాన్స్...

మ్యాచ్ ముగిసిన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. సీజన్ ఆరంభంలో ఓ అద్భుత హాఫ్ సెంచరీ చేసిన మనీశ్ పాండేని ఎందుకు పక్కనబెట్టారనే ప్రశ్నకు వార్నర్ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.
undefined
‘మనీశ్ పాండేని పక్కనబెట్టడం నాకైతే ఇష్టం లేదు. కేవలం రెండు మ్యాచుల్లో ఆడనంత మాత్రాన సీనియర్ ప్లేయర్‌ను జట్టు నుంచి తప్పించకూడదు. అయితే అది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం...
undefined
విరాట్ సింగ్ మంచి ప్లేయర్. అయితే పిచ్ బ్యాటింగ్‌కి ఏ మాత్రం సహకరించడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. విజయ్ శంకర్ కూడా చక్కగా బౌలింగ్ చేశాడు.
undefined
విజయ్ శంకర్‌తో మరో ఓవర్ బౌలింగ్ చేయాల్సింది. బెయిర్ స్టో, కేన్ విలియంసన్ అద్భుతంగా పోరాడారు. మిడిల్ ఓవర్లలో కావాల్సినన్ని పరుగులు చేయలేకపోయాం...’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్.
undefined
మొదటి మ్యాచ్‌లో 66 పరుగులతో రాణించినప్పటికీ, కీలకమైన సమయంలో ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడు మనీశ్ పాండే. ఓటమి ఖరారైన తర్వాత ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు.
undefined
ఆ తర్వాతి మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన మనీశ్ పాండే ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.
undefined
మనీశ్ పాండే స్థానంలో జట్టులోకి వచ్చిన విరాట్ సింగ్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 బంతులు ఆడి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సింగిల్స్ తీయడానికి కూడా తెగ ఇబ్బంది పడ్డాడు విరాట్ సింగ్..
undefined
విరాట్ సింగ్ బౌండరీలు బాదకపోయినా స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ కేన్ విలియంసన్‌కి ఎక్కువ బంతులు ఆడే అవకాశం కల్పించినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈజీగా గెలిచి ఉండేది...
undefined
click me!