‘అమ్మో... కరోనా, ఇక్కడ ఉండలేం బాబోయ్...’ స్వదేశానికి మరో ఇద్దరు క్రికెటర్లు, ఇప్పుడు ఆర్‌సీబీకి...

Published : Apr 26, 2021, 03:33 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌పై కరోనా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ప్రారంభమైన తర్వాత ఏ ప్లేయర్‌కి కరోనా పాజిటివ్ రాకపోయినా, బయో బబుల్ సెక్యూర్ జోన్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ మ్యాచులు నిర్వహిస్తున్నా... దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు విదేశీ క్రికెటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి...

PREV
17
‘అమ్మో... కరోనా, ఇక్కడ ఉండలేం బాబోయ్...’ స్వదేశానికి మరో ఇద్దరు క్రికెటర్లు, ఇప్పుడు ఆర్‌సీబీకి...

రాజస్థాన్ రాయల్స్‌కి చెందిన ఇద్దరు క్రికెటర్లు లియామ్ లివింగ్‌స్టోన్, ఆండ్రూ టై... దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా, బయో సెక్యూలర్ జోన్‌లో ఉండలేకపోతున్నామంటూ స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే.

27

ఇప్పుడు ఈ లిస్టులో మరో ఇద్దరు ఆసీస్ క్రికెటర్లు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లైన ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ కూడా కరోనా భయంతో స్వదేశానికి బయలుదేరి వెళ్లారు...

37

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే పెళ్లి చేసుకున్న ఆడమ్ జంపా, లేటుగా జట్టుతో చేరాడు. అలాగే రిచర్డ్‌సన్ ఇప్పటికే ఆర్‌సీబీ తరుపున ఓ మ్యాచ్ కూడా ఆడాడు. అయితే ఈ ఇద్దరూ దేశంలో కరోనా సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి తట్టుకోలేక స్వదేశానికి బయలుదేరారు.

47

ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌ జట్టు నలుగురు ఫారిన్ ప్లేయర్లను దూరం చేసుకోవాల్సి వచ్చింది. గాయాల కారణంగా బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ దూరం కాగా... లియామ్ లివింగ్‌స్టోన్, ఆండ్రూ టై మధ్యలోనే ఇంటిదారి పట్టారు...

57

వీరితో పాటు భారత స్పిన్నర్, ఢిల్లి క్యాపిటల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా కరోనా కష్టకాలంలో కుటుంబానికి రక్షణగా ఉండాలని నిర్ణయం తీసుకుని, ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరమయ్యాడు. 

67

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ జోష్ హజల్‌వుడ్, కరోనా భయంతో ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు. అతని స్థానంలో మరో ప్లేయర్‌ను పట్టుకోవడమే చాలా కష్టమైపోయింది.

77

ఐపీఎల్ 2021 సీజన్‌లో పట్టుమని 20 మ్యాచులు కూడా పూర్తికాకముందే అరడజను మంది ప్లేయర్లు, అర్ధాంతరంగా నిష్కమించడంతో  మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు.

click me!

Recommended Stories