క్రికెట్‌లో ఎంట్రీ ఇస్తున్న ఉసేన్ బోల్ట్... ఇండియాలో ఆ లీగ్‌లో ఆడబోతున్న జమైకన్ చిరుత...

First Published Sep 16, 2022, 6:52 PM IST

ఉసేన్ బోల్ట్... చిరుత పులిని తలపించే వేగంతో పరుగెత్తుతూ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న స్ప్రింటర్. ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచిన ఈ జమైక పరుగుల వీరుడిని అందరూ ‘చిరుత’ అని పిలుస్తుంటారు. పరుగు పందెంలో ప్రపంచ రికార్డు నెలకొల్పినప్పటికీ, ఉసేన్ బోల్డ్‌కి క్రికెట్ అంటే భలే ఇష్టం...

చిన్నతనం నుంచి క్రికెటర్ కావాలని కలలు కన్న ఉసేన్ బోల్ట్, అనేక కారణాలతో ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. అయితే త్వరలో క్రికెట్ బ్యాట్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు ఉసేన్ బోల్ట్...

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఉసేన్ బోల్ట్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడేందుకు సిద్ధమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు...

Usain Bolt

పరుగు పందెం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఉసేన్ బోల్ట్, క్రికెటర్‌గా మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇండియా మొట్టమొదటి లైవ్ డిజిటిల్ స్పోర్ట్స్ ఛానెల్ ‘పవర్ స్పోర్ట్స్’ ఆధ్వర్యంలో గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్ పేరుతో ఓ టీ20 లీగ్‌ను మొదలెట్టబోతున్నారు...

న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకూ ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనబోతున్నాయి...


మొదటి ఎడిషన్ ఇండియాలో జరగబోతుంటే ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూఎస్‌ఏ, కెనడా, సౌతాఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు నిర్వహాకులు...

usain bolt

ఇప్పటికే ఈ 8 టీమ్స్‌కి పేర్లు కూడా పెట్టేశారు. ఇండియన్ సప్పైర్స్, ఆస్ట్రేలియాన్ గోల్డ్స్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరీస్, సౌతాఫ్రికా ఎమెరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్ పేరుతో 8 జట్లు పోటీలో దిగబోతున్నాయి.

ఉసేన్ బోల్ట్‌తో పాటు మునాఫ్ పటేల్, యూసపఫ్ పఠాన్, గుల్భాద్దిన్ నైబ్, ఏంజెలో మాథ్యూస్,ఇయాన్ బెల్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఈ గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనబోతున్నారు.. 

click me!