కౌంటీల్లోనూ టీమిండియాను వదలని గాయాలు... ఉమేశ్ యాదవ్ కూడా గాయంతో అవుట్...

First Published Sep 16, 2022, 6:00 PM IST

టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయిన భారత క్రికెటర్లు బ్రేక్ టైమ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు. అయితే అక్కడ కూడా భారత ప్లేయర్లను గాయాలు వెంటాడుతున్నాయి. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మిడిల్‌సెక్స్ క్లబ్ తరుపున ఉమేశ్ యాదవ్ కూడా గాయంతో స్వదేశానికి తిరిగి వస్తున్నాడు...

Umesh Yadav

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2022లో ఇంకా రెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. లీస్టర్‌షైర్‌తో వచ్చే వారం, వోర్‌స్టెర్‌షైర్‌తో ఆ తర్వాత వారం మ్యాచులు ఆడనుంది మిడిల్‌సెక్స్. అయితే రాయల్ లండన్ కప్‌ మ్యాచ్‌లో గాయపడిన ఉమేశ్ యాదవ్, తర్వాతి మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని ప్రకటించింది మిడిల్‌సెక్స్...

ఇప్పటికీ గాయంతో స్వదేశానికి చేరుకున్న ఉమేశ్ యాదవ్, బీసీసీఐ మెడికల్ టీమ్‌ పర్యవేక్షణలో వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఉమేశ్ యాదవ్ గాయం నుంచి కోలుకుని సెప్టెంబర్ 17న తిరిగి జట్టుతో కలుస్తాడని భావించారు మిడిల్‌సెక్స్ టీమ్...

Umesh Yadav Injury

అయితే ఉమేశ్ యాదవ్‌కి అయిన గాయం తీవ్రమైనదిగా తేలడంతో అతనికి కొన్ని వారాల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. దీంతో అతను కౌంటీ మ్యాచులకు కోసం తిరిగి వెళ్లడం లేదు..

‘ఉమేశ్ యాదవ్‌ ఈ సీజన్‌లో ఆఖరి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని తెలిసి తీవ్ర నిరాశ చెందాం. అయితే అతను త్వరగా గాయం నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాం... ఉమేశ్ యాదవ్, జట్టులో చాలా చక్కగా సెట్ అయ్యాడు...’ అంటూ ప్రకటించింది మిడిల్‌సెక్స్ టీమ్...

ఉమేశ్ యాదవ్‌తో కలిపి ఇప్పటికే కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2022లో గాయపడిన భారత ఆటగాళ్ల సంఖ్య మూడుకి చేరింది. యాదవ్‌కి ముందు భారత ఆల్‌రౌండర్లు కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ కూడా గాయాలతో కౌంటీల నుంచి వెనక్కి వచ్చారు...

రాయల్ లండన్ వన్డే క్రికెట్ టోర్నీలో 7 మ్యాచులు ఆడిన ఉమేశ్ యాదవ్ 16 వికెట్లు పడగొట్టి, మిడిల్‌సెక్స్ క్లబ్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు.  

click me!