అందుకే ఉమ్రాన్ కు లాస్ట్ ఓవర్ ఇచ్చా.. టీమిండియా కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Jun 29, 2022, 11:11 AM IST

Umran Malik: ఇండియా-ఐర్లాండ్ మధ్య బుధవారం ముగిసిన  రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీగా పరుగులు సాధించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. 

PREV
17
అందుకే ఉమ్రాన్ కు లాస్ట్ ఓవర్ ఇచ్చా.. టీమిండియా కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐర్లాండ్ పర్యటనను భారత జట్టు విజయవంతంగా ముగించింది. టీమిండియా ఈ సిరీస్  ను 2-0తో గెలుచుకుంది. హై స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో భారత జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. 

27

ఇండియా నిర్దేవించిన 227 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ పోరాటం ఆకట్టుకుంది. చివరి బంతి వరకు పోరాడినా ఐర్లాండ్ కు విజయం దక్కలేదు.  అయినా వాళ్ల ఆట మాత్రం ఇండియా శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. 

37

ముఖ్యంగా చివరి ఓవర్లో  17 పరుగులు అవసరమనగా పాండ్యా.. అంతగా అనుభవం లేని యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు బంతినివ్వడంతో అందరిలోనూ ఆందోళన. పేస్ బౌలింగ్ లో బంతిని కాస్త తాకిచ్చినా అది బౌండరీకి వెళ్లడం ఖాయం.  కానీ పాండ్యా మాత్రం ఉమ్రాన్ పై నమ్మకముంచానని, అతడు 17 పరుగులను కాపాడతాడనే నమ్మకంతోనే బంతిని అందించానని చెప్పుకొచ్చాడు. 

47

మ్యాచ్  అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. ‘ఆ క్షణంలో ఒత్తిడిని అధిగమమించేందుకు ప్రయత్నించాను. ఆ  పరిస్థితులకు తగ్గట్టు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నదానిపై మాత్రమే దృష్టి సారించాను.  ఉమ్రాన్  పై నమ్మకముంచాను.  
 

57

ఉమ్రాన్ బౌలింగ్ లో పేస్ ఉంది. 17 పరుగులను అతడు డిఫెండ్ చేయగలడని అనిపించింది.  స్పీడ్ బౌలింగ్ లో పరుగులు రాబట్టడం అంత సులభం కాదు...’ అని తెలిపాడు. ఇదే క్రమంలో ఐర్లాండ్ బ్యాటర్లు కూడా బాగా ఆడారని పాండ్యా కొనియాడాడు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని పాండ్యా అన్నాడు. 

67

చివరి ఓవర్లో ఐర్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరం కాగా అప్పటికే వీరవిహారం చేస్తున్న జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్ లు అవి కూడా కొట్టేస్తారా..? అన్న అనుమానం కలిగింది. కానీ ఉమ్రాన్ మాత్రం.. తొలి  బంతికి పరుగేమీ ఇవ్వలేదు. 

77

రెండో బంతిని నో బాల్ వేశాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు అడైర్.  కానీ నాలుగు, ఐదో బంతులకు రెండు పరుగులే వచ్చాయి. ఇక చివరి బాల్ కు ఆరు పరుగులు అవసరం కాగా.. ఉమ్రాన్ ఒక్క పరుగే ఇచ్చాడు. అంతే.. విజయం భారత్ వశమైంది. 

click me!

Recommended Stories