ఒకేసారి వన్డేల్లో ఇద్దరు కెప్టెన్లు... ఓ జట్టుకి రోహిత్ శర్మ, మరో టీమ్‌కి కెప్టెన్‌గా కెఎల్ రాహుల్...

First Published Jan 25, 2022, 4:59 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్‌కప్ 2023 టోర్నీకి ఇంకో ఏడాది మాత్రమే ఉంది. సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌లో మనోళ్ల పర్ఫామెన్స్ చూసినవాళ్లకి, ఈ జట్టుకి ఐసీసీ వరల్డ్‌కప్ గెలిచే సీన్ లేదని క్లియర్‌గా అర్థమైపోయింది. అయితే వన్డేలను పెంచే ఆలోచనలు చేస్తోందట బీసీసీఐ...

సౌతాఫ్రికా టూర్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు, ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది... 

ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఫిబ్రవరి 20న ముగుస్తుంది...

ఆ తర్వాత శ్రీలంకతో కలిసి రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకూ ఈ సిరీస్ జరుగుతుంది...

ఆ తర్వా త మార్చి 27న ఐపీఎల్ 2022 సీజన్ మొదలుకానుంది. అంటే మధ్యలో కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ గ్యాప్‌లో రెండు వన్డే సిరీస్‌లు నిర్వహించాలని చూస్తోందట బీసీసీఐ...

గత ఏడాది ప్రయోగం చేసినట్టుగానే ఒకేసారి రెండు జట్లతో రెండు వేర్వేరు జట్లతో వన్డే సిరీస్‌లు నిర్వహించాలని ఆలోచనలు చేస్తోంది భారత క్రికెట్ బోర్డు...

ఆఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది భారత జట్టు. ఇదే సమయంలో న్యూజిలాండ్‌లో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఏర్పాట్లు చేస్తోందని టాక్..

న్యూజిలాండ్‌లో పర్యటించే జట్టుకి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తే, స్వదేశంలో ఆఫ్ఘాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కి కెఎల్ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారని సమాచారం...

సౌతాఫ్రికాలో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్‌కి కెప్టెన్‌గా నిరూపించుకోవడానికి బీసీసీఐ ఇస్తున్న చివరి అవకాశం ఇది. స్వదేశంలో పసికూనను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు కూడా...

శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టు, ఆ తర్వాత ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ ఆడనుందని... మరో జట్టు టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌కి పయనం కానుందని సమాచారం...

మార్చి 18న శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్ ఆడే టీమిండియా ప్లేయర్లు... ఆ తర్వాత వారం రోజుల గ్యాప్‌లో రెండు వన్డే సిరీస్‌లు, ఆరు మ్యాచులు ఆడి... మార్చి 25-26 కల్లా ఐపీఎల్‌లో చేరబోతున్నారు...

వన్డే వరల్డ్‌కప్ 2023 టోర్నీకి కనీసం 30 మంది ప్లేయర్లతో జట్టును తయారుచేసేందుకు ఈ విధంగా డబుల్ టీమ్ ఫార్ములాను బీసీసీఐ ఎంచుకుందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

click me!