వరల్డ్ కప్‌కి 10 నెలల ముందు నుంచే మీటింగ్స్ పెట్టాం! అతని కష్టాలు విని, టీమిండియా ప్లేయర్లు...

First Published Sep 1, 2023, 5:05 PM IST

1983 తర్వాత 28 ఏళ్లకు 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడిన మొదటి టీ20, మొదటి వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా టైటిల్స్ గెలిచింది. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియాకి మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా వ్యవహరించాడు ప్యాడీ అప్టన్..

Image Credit: Getty Images

2011 వన్డే వరల్డ్ కప్‌కి ముందే ఏ జట్టూ కూడా స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీని గెలవలేకపోయింది. ముంబైలో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి, స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా నిలిచింది టీమిండియా. 2011 వన్డే వరల్డ్ కప్‌కి మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా వ్యవహరించిన ప్యాడీ అప్టన్, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు..

‘నిజం చెప్పాలంటే వన్డే వరల్డ్ కప్ 2011 ఫైనల్ మ్యాచ్‌కి ముందు రోజు వరకూ ప్రతీ టీమ్ మీటింగ్‌లో మేం ప్రపంచ కప్ గురించే చర్చించుకున్నాం. ఫైనల్‌లో ఎలా ఆడాలి? ఎలా గెలవాలి? ఈ రెండు విషయాల గురించే చర్చ జరిగింది. ఫైనల్ దాకా వెళ్లపోతే ఎలా అనే ఆలోచన కూడా మాకు రాలేదు..

కచ్చితంగా ఫైనల్ ఆడతామనే నమ్మకంతోనే ఉన్నాం. ఆ సమయంలో టూర్లు, వాతావరణ పరిస్థితులు, ఫిట్‌నెస్ టెస్టులు.. ఇలా అంతర్జాతీయ క్రికెట్ ఆడడాన్ని భారత క్రికెటర్లు చాలా పెద్ద ఛాలెంజ్‌గా భావించేవాళ్లు. నేను ఆ విషయాన్ని గమనించా. అప్పుడు మైక్ హార్న్‌తో ఓ మీటింగ్ ఏర్పాటు చేశా..
 

అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పర్వతాలు, కొండలు ఎక్కుతూ తాను పడే అవస్థతలను మైక్ హార్న్ సవివరంగా వివరించాడు. ఆయన మాటలు విన్న భారత క్రికెటర్లకు, తాము ఫేస్ చేస్తున్న ఇబ్బందులు పెద్ద సమస్యలే కాదనే విషయం అర్థమైంది..
 

వారిలో ప్రెషర్ తగ్గించడానికి ఆయన మాటలు, ఎంతగానో ఉపయోగపడ్డాయి. క్రికెట్‌లో బయటి ప్రపంచంలో చాలా ఒత్తిడి ఉందనే విషయాన్ని గ్రహించారు. వరల్డ్ కప్‌కి ముందు యువరాజ్ సింగ్ ఫామ్‌ కోల్పోయి, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఎంత ట్రై చేసినా ఏదీ వర్కవుట్ కాలేదు..

యువరాజ్ సింగ్‌ని మళ్లీ ఫామ్‌లోకి తేవడం సచిన్ టెండూల్కర్‌ వల్లే సాధ్యమని గ్రహించా. ఎందుకంటే యువీకి, సచిన్ మెంటర్, దేవుడితో సమానం. నీ జీవితంలో ఎక్కువ ప్రేమించే, అభిమానించే, ఆరాధించే, గౌరవించే, విలువనిచ్చే వ్యక్తి కోసం ఆడమని చెప్పా. ఆ మాటలు అతనిలో కొండంత ఎనర్జీని నింపాయి.. 

2008 నుంచి 2011 వరకూ టీమ్‌ని వరల్డ్ కప్ కోసం తయారుచేశాం. ఇతను బాగా ఆడకపోతే, అతను బాగా ఆడకపోతే ఇతను అని అనుకోలేదు. ఆడినా ఆడకపోయినా వీళ్లే ఉండాలని ఫిక్స్ అయ్యాం...

అలా హ్యాపీయెస్ట్, స్ట్రాంగెస్ట్ టీమ్‌ తయారుచేశాం. వరల్డ్ కప్ విన్నింగ్ సీక్రెట్ ఇదే..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ మెంటల్ కండీషనింగ్ కోచ్‌, స్ట్రాటెజిక్ అనాలసిస్ట్ ప్యాడీ అప్టన్.. 

click me!