టీమిండియా తరుపున టెస్టుల్లో మొదటి త్రిబుల్ సెంచరీ బాదిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ తర్వాత కరణ్ నాయర్ మాత్రమే ఈ ఫీట్ సాధించగలిగాడు. ముల్తాన్‌లో 309 పరుగులు చేసిన వీరూ, ‘ముల్తాన్ సుల్తాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు..
2004, మార్చి 28న ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 675/5 పరుగుల భారీ స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. ఆకాశ్ చోప్రా 42, రాహుల్ ద్రావిడ్ 6, వీవీఎస్ లక్ష్మణ్ 29, యువరాజ్ సింగ్ 59 పరుగులు చేశారు..
28
375 బంతుల్లో 39 ఫోర్లు, 6 సిక్సర్లతో 309 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా తరుపున మొట్టమొదటి త్రిబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇదే మ్యాచ్‌లో 348 బంతుల్లో 21 ఫోర్లతో 194 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ డిక్లరేషన్ కారణంగా డబుల్ సెంచరీ అందుకోలేకపోయాడు..
38
తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకి ఆలౌట్ అయి ఫాలోఆన్ ఆడిన పాకిస్తాన్, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది..
48
లాహోర్‌లో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్, 1-1 తేడాతో సిరీస్‌ని డ్రా చేసింది. రావల్పిండిలో జరిగిన మూడో టెస్టు, సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 131 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది..
58
Virender Sehwag
‘ముల్తాన్‌లో 309 పరుగులు చేసిన తర్వాత రావల్పిండిలో మూడో టెస్టు ఆడడానికి వెళ్లాం. అప్పుడు నాకు తీవమ్రైన వెన్నునొప్పి వచ్చింది. అస్సలు నిలబడలేకపోతున్నా. రేపు ఉదయం మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా కెప్టెన్ దాదా దగ్గరికి వెళ్లి విషయం చెప్పాను..
68
దాదా నా బ్యాక్ చాలా నొప్పిగా ఉంది. నేను రేపటి మ్యాచ్ ఆడలేనని చెప్పా. దాదా మాత్రం ఒప్పుకోలేదు. నువ్వు టీమ్‌లో ఉంటే చాలు, పాక్ బౌలర్లు భయపడతారు. నువ్వు డకౌట్ అయినా పర్లేదు, నువ్వు అయితే రేపు మ్యాచ్ ఆడుతున్నావ్? అని చెప్పాడు...
78
దాదా చెప్పినట్టే నేను ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యా. పార్థివ్ పటేల్‌తో కలిసి ఓపెనింగ్ చేశా. సింగిల్ తీసి పార్థివ్‌కి స్ట్రైయిక్ ఇద్దామని అనుకున్నా...
88
షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఫ్లిక్ కొట్టా, గల్లీలో ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాను.. అయితే ఆ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ 270 పరుగులు చేయడమే మేం గెలిచాం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...