వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. అంతకుముందు ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో తలబడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
ఆఫ్ఘాన్‌పై 3-0 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన పాకిస్తాన్, నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో విజయం అందుకుంది. దీంతో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడినా పాకిస్తాన్, సూపర్ 4 రౌండ్‌కి చేరడం ఖాయం..
28
‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ప్రతీ చోట రాజకీయాలు, క్రీడలను ప్రభావితం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లోనూ పరిస్థితి ఇదే..
38
రెండు శత్రుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఫైట్ పీక్స్‌లో ఉంటుంది. ఈసారి కూడా ఇండియా- పాకిస్తాన్ మధ్య అలాంటి హై టెన్షన్ మ్యాచ్ ఆశిస్తున్నా. ఇండియాకి మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. పాకిస్తాన్‌కి అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది. పాకిస్తాన్‌కే కాస్త ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి..
48
Virat Kohli
ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. పాక్ బౌలింగ్‌లో షాహీన్ ఆఫ్రిదీ కీలకంగా మారతాడు. ఎందుకంటే భారత బ్యాటర్లకు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ల వీక్‌నెస్ ఉంది. షాహీన్ ఆఫ్రిదీ మంచి క్వాలిటీ బౌలర్, అద్భుతమైన పేస్‌తో బంతిని స్వింగ్ చేస్తాడు..
58
Virat Kohli and Rohit Sharma
టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువ. లెఫ్ట్ హ్యాండ్ పేసర్‌ని ఎదుర్కోవడం, రైట్ హ్యాండ్ బ్యాటర్లకు చాలా కష్టం. అయితే టీమిండియాకి విరాట్ కోహ్లీ కీ ప్లేయర్. సచిన్ టెండూల్కర్ తర్వాత అలాంటి రికార్డు, విరాట్ కోహ్లీకే ఉంది. అతని ఆకలి ఎప్పటికీ తీరదు..
68
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, హారీస్ రౌఫ్ కొట్టిన సిక్సర్లు... ఇప్పటికీ నాకు కళ్ల ముందే ఉన్నాయి. టెండూల్కర్ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ జీవితంలో కూడా ఉన్నాయి. అయితే అతను ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు..
78
టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో ఎంత మంది ఉన్నా విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేస్తే, ఆ ప్రభావం మిగిలిన బ్యాటర్లపై కచ్ఛితంగా పడుతుంది. భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి, వారిపై పైచేయి సాధించాలంటే విరాట్ వికెట్ తీస్తే సరిపోతుంది..
88
భారత బౌలింగ్ యూనిట్‌పై కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే జస్ప్రిత్ బుమ్రా నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీ కూడా చాలా రోజులుగా వన్డేలు ఆడలేదు.. త్వరగా వికెట్ తీయకపోతే పాకిస్తాన్ ప్రమాదకరంగా మారుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్..