IPL 2020: ఈ సీజన్‌లో కచ్ఛితంగా బద్ధలయ్యే రికార్డులు ఇవే...

First Published Sep 15, 2020, 4:16 PM IST

క్రికెట్ అంటేనే రికార్డుల పుస్తకం. వరల్డ్ ఫేమస్ క్రేజీ లీగ్ ఐపీఎల్‌లో అయితే రికార్డులకు కొదువే లేదు. ప్రతీ సీజన్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నారు క్రికెటర్లు. ఈసారి కూడా కచ్ఛితంగా బద్దలయ్యే కొన్ని రికార్డులు ఇవి.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. 5,412 పరుగులు చేసిన కోహ్లీ, ఈ సీజన్‌లో మరో 600 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 6 వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు.
undefined
ఐపీఎల్‌లో4,898 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, మరో 102 పరుగులు చేసి 5 వేల క్లబ్‌లో చేరబోతున్నాడు. ఈ క్లబ్‌లో ఇప్పటిదాకా రైనా, కోహ్లీ మాత్రమే ఉన్నారు.
undefined
డేవిడ్ వార్నర్ 4706, శిఖర్ ధావన్ 4,579 పరుగులతో ఉన్నారు. వీరు కూడా ఈ సీజన్‌లో 5 వేల పరుగుల క్లబ్‌లో చేరడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
undefined
ఐపీఎల్‌లో 44 హాఫ్ సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్, అత్యధిక అర్ధ శతకాలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. సురేశ్ రైనా 38, ధావన్ 37 హాఫ్ సెంచరీలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. గంభీర్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ, రోహిత్ శర్మ ఈసారి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
undefined
ఐపీఎల్‌లో 5 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, మరో రెండు సెంచరీలు చేస్తే అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్‌ను వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌లోకి వస్తాడు. ఆరో సెంచరీలతో ఉన్న గేల్, ఈసారి మరో సెంచరీ కొడితే మాత్రం ఇద్దరికీ పోటీ తప్పదు.
undefined
ఐపీఎల్‌లో 194 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, మరో 6 సిక్సర్లు బాదితే 200 సిక్సర్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటిదాకా క్రిస్‌గేల్ (326), ఏబీ డివిల్లియర్స్ (212), ధోనీ (209) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.
undefined
ఐపీఎల్‌లో 12 సార్లు డకౌట్ అయిన మనీశ్ పాండే, రోహిత్ శర్మ... ఈ సీజన్‌లో ఒక్కసారి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరినా చెత్త రికార్డు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అత్యధికసార్లు డకౌట్ అయిన క్రికెటర్లుగా హర్భజన్, పార్థివ్ పటేల్‌తో కలిసి టాప్‌ స్థానంలోకి వెళ్లాల్సి ఉంటుంది.
undefined
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో మూడు మ్యాచులు ఓడిపోతే 100 ఓటములు ఎదుర్కొన్న మొట్టమొదటి ఐపీఎల్ జట్టుగా నిలుస్తుంది. పంజాబ్ 94, బెంగళూరు 92 ఓటములతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
undefined
click me!