Fastest centuries: టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్-10 ప్లేయర్లు వీరే

Published : Feb 08, 2025, 09:01 PM IST

Top 10 fastest centuries in T20 cricket: సాహిల్ చౌహాన్, సికందర్ రజా, రోహిత్ శ‌ర్మ‌, అభిషేక్ శ‌ర్మ స‌హా అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచ‌రీలు కొట్టిన టాప్-10 ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
16
Fastest centuries: టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్-10 ప్లేయర్లు వీరే
Top 10 fastest centuries in T20 cricket, Rohit sharma, Abhishek sharma

Top 10 fastest centuries in T20 cricket: ధ‌నాధ‌న్ బ్యాటింగ్, సూప‌ర్ బౌలింగ్ తో ఊహించని మ‌లుపు తిరిగే మ్యాచ్ ల‌కు పెట్టింది పేరు టీ20 క్రికెట్. వ‌న్డే, టెస్టు క్రికెట్ ల‌తో పోలిస్తే టీ20 క్రికెట్ అందించే మ‌జానే వేరు. ఈ ఫార్మాట్ లో సెంచ‌రీ చేయ‌డం అంటే సూప‌ర్ రికార్డు అని చెప్పాలి.

ఇక టీ20 క్రికెట్ లో సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్లు  చాలా త‌క్కువ మందే ఉన్నారు. అయితే, అత్యంత వేగంగా టీ20 క్రికెట్ సెంచ‌రీ సాధించిన టాప్-10 ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో ఎవ‌రు టాప్ లో ఉన్నారు, భారత ప్లేయర్లు ఎవరున్నారనే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకోసం. 
 

26
Sahil Chauhan

1. టీ20లో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ప్లేయ‌ర్ సాహిల్ చౌహాన్

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఇప్పుడు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అత‌ను జూన్ 17, 2024 న సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేశాడు. అతని ఈ సూప‌ర్ ఇన్నింగ్స్ ఇంత‌కుముందు లెజెండ‌రీ ప్లేయ‌ర్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. ఇప్పుడు క్రికెట్ లో సాహిల్ చౌహాన్ సాధించిన 27 బంతుల సెంచ‌రీ అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీగా ఉంది. 

2. సికందర్ రాజా 

జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికందర్ రజా టీ20 క్రికెట్ లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. అతను 2024లో కేవలం 33 బంతుల్లోనే గాంబియాతో జరిగిన మ్యాచ్ లో టీ20 సెంచరీ కొట్టాడు.

36
Kushal Malla

3. జాన్ నికోలస్ లాఫ్టీ ఈటన్ 

నమీబియాకు చెందిన క్రికెటర్ జాన్ నికోలస్ లాఫ్టీ ఈటన్ 2024లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. 

4. కుశాల్ మల్లా 

నేపాల్ క్రికెట్ కుశాల్ మల్లా టీ20 క్రికెట్ లో కేవలం 34 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో అతను సాధించిన ఈ సెంచరీ నాల్గో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. తన ఇన్నింగ్స్ లో అతను 12 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు.  

46

5. డేవిడ్ మిల్లర్

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 2017లో బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో అతను 7 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. 

6. రోహిత్ శర్మ

భారత స్టార్ ప్లేయర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 

56
Image Credit: Getty Images

7. సుదేశ్ విక్రమశేఖర

సుదేష్ విక్రమశేఖర చెక్ రిపబ్లిక్ క్రికెట్ జట్టుకు చెందిన బ్యాటర్. టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ కొట్టి ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అతను 2019లో టర్కీతో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు.

8. అభిషేక్ శర్మ 

భారత యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ 2025లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. టీ20లో వేగవంతమైన సెంచరీలు కొట్టిన ప్లేయర్ల లిస్టులో అతను 8వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ అభిషేక్ శర్మ కొట్టినదే. 

66
Image Credit: Getty Images

9. శివకుమార్ పెరియాళ్వార్ 

రోమేనియా క్రికెట్ జట్టుకు చెందిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివకుమార్ పెరియాళ్వార్ కూడా టీ20 క్రికెట్ లో సూపర్ సెంచరీ కొట్టాడు. అతను 2019లో టర్కీపై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 

10. సంజూ శాంసన్ 

భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ 2024లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 40 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.  ఈ సెంచరీ  ఇన్నింగ్స్ లో సంజూ 9 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. 

Read more Photos on
click me!

Recommended Stories