షోయబ్ మాలిక్‌ని రిటైర్మెంట్ తీసుకోమ్మని సూచించిన పాక్ మాజీ కెప్టెన్... లేదంటే అవమానాలు తప్పవని...

First Published Sep 19, 2022, 3:33 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన పాక్ జట్టుపై అక్కడ చాలా పెద్ద చర్చే జరుగుతోంది. ఇక్కడ సంజూ శాంసన్‌కి టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో చోటు దక్కకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే... పొరుగుదేశం పాక్‌లో షోయబ్ మాలిక్‌ని ఎంపిక చేయకపోవడంపై తీవ్రమైన డిస్కర్షన్ నడుస్తోంది...

Shoaib Malik

‘షోయబ్ మాలిక్, పాకిస్తాన్ జట్టు కోసం తాను చేయగలిగిన దాని కంటే ఎక్కువే చేశాడు. తన కెరీర్‌లో 21-22 ఏళ్ల పాటు ఫిట్‌నెస్ మెయింటైన్ చేసుకుంటే పాకిస్తాన్‌ క్రికెట్ టీమ్‌కి ఆడడమంటే మామూలు విషయం కాదు...

Image Credit: Getty Images

నేను రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు షోయబ్ మాలిక్‌ని రిటైర్మెంట్ తీసుకొమ్మని సూచించా. నాకు జరిగినట్టే తనకి కూడా జరుగుతుందని నాకు తెలుసు. జట్టుకి ఎంత చేసినా గౌరవం ఇవ్వరు, అవమానించి పంపిస్తారని అర్థమయ్యేలా చెప్పాను...

అతను పాక్ క్రికెట్‌ టీమ్‌కి లెజెండ్. అయితే షోయబ్ మాలిక్ మాత్రం చివరిసారిగా ఓ టోర్నీ ఆడి తప్పుకోవాలని అనుకున్నాడు. అయితే క్రికెట్‌ క్రూరమైన ఆట. ఇక్కడ దయా, గౌరవం, లాయల్టీ అనే వాటికి చోటు ఉండదు... 

షోయబ్ మాలిక్ వన్డేల నుంచి తప్పుకున్నప్పుడు కూడా అతనికి ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వలేదు. అతను జట్టుకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటే అతన్ని గౌరవంగా సాగనంపడం కనీస మర్యాద. 

అయితే మా మేనేజ్‌మెంట్ మాత్రం ఇలాంటి ఫేర్‌వెల్‌ మ్యాచులను పట్టించుకోదు...అతను టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడి ఉంటే, టీమ్‌కి ఓ సీనియర్ ప్లేయర్ అందుబాటులో ఉండేవాడు. షోయబ్ మాలిక్ కట్ షాట్ ఆడలేడు, ఫుల్ షాట్ ఆడలేడు అని సొల్లు మాటలు చెప్పకండి...

ఎందుకంటే అతను 22 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. పాక్ తరుపున అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా ఉన్నాడు. కాబట్టి అతని డిక్షనరీలో ఏ షాట్స్ ఉన్నాయి, ఏవి లేవనేది అనవసరం. అతను చేసిన పరుగులే తన టాలెంట్ ఏంటో చూపిస్తాయి...

ఏ జట్టుకైనా విజయం దక్కాలంటే విన్నింగ్ కాంబినేషన్ కావాలి. అంతేకానీ 20ల్లో ఉన్న ప్లేయర్లు కావాలి, 40ల్లో ఉన్నవాళ్లు పనికిరారనే వాదన ఏ మాత్రం కరెక్ట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్... 

click me!