కార్తీక్, పంత్.. ఇద్దర్లో ఎవరిని ఆడించాలి..? హిట్‌మ్యాన్‌కు సన్నీ కీలక సూచన

First Published Sep 19, 2022, 3:09 PM IST

IND vs AUS T20I: టీమిండియా వికెట్ కీపర్లు రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ఖ లలో రాబోయే పొట్టి ప్రపంచకప్ లో తుది జట్టులో ఉండే అవకాశం ఎవరికి దక్కనుంది..? ఎవరో ఒకరికే రోహిత్ శర్మ ఓటేస్తాడా..? లేదా ఇద్దరినీ ఆడిస్తాడా..? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది. 

వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా వేదికగా మొదలుకావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే భారత జట్టును  ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మందితో కూడిన ఈ జట్టులో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తో పాటు రిషభ్ పంత్ కూడా ప్లేస్ దక్కించుకున్నాడు. 

అయితే ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులో ఆడించాలి..? అనేదానిమీద టీమిండియా వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. ఈ ఏడాది మేలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. కొన్ని మ్యాచ్ లలో పంత్ తో కలిసి ఆడాడు.  ఆసియా కప్ లో పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో కార్తీక్ ఆడగా మిగిలిన నాలుగు మ్యాచులలో పంత్ కు అవకాశం దక్కింది. 

మరి రాబోయే పొట్టి ప్రపంచకప్ లో తుది జట్టులో ఉండే అవకాశం ఎవరికి దక్కనుంది..? ఎవరో ఒకరికే రోహిత్ శర్మ ఓటేస్తాడా..? లేదా ఇద్దరినీ ఆడిస్తాడా..? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది. అయితే  హిట్‌మ్యాన్ కు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్  ఈ విషయంలో కీలక సూచన చేశాడు. 

ఓ జాతీయ పత్రికతో గవాస్కర్ మాట్లాడుతూ... ‘నేనైతే  దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ఇద్దరూ జట్టులో ఉండాలని భావిస్తున్నా.  బ్యాటింగ్ ఆర్డర్ లో పంత్ ఐదో స్థానంలో  రావాలి. ఆ తర్వాత ఆరో స్థానంలో  హార్ధిక్ పాండ్యా వస్తే బాగుంటుంది. 

ఇక ఫినిషర్ గా భావిస్తున్న దినేశ్ కార్తీక్.. ఏడో నెంబర్ లో బ్యాటింగ్ కు వస్తే టీమిండియాకు మంచింది..’ అని అన్నాడు. ఇద్దరినీ ఆడిస్తేనే బెటరని.. తద్వారా జట్టులో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యండ్ కాంబినేషన్ కుదురుతుందని.. అంతేగాక జట్టులో సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని  సన్నీ చెప్పాడు. 
 

Image credit: PTI

ఆరుగురు బౌలర్లతో కాకుండా రోహిత్ శర్మ వచ్చే ప్రపంచకప్ లో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగితే బెటరని  గవాస్కర్ తెలిపాడు.  ఇదే విషయమై  సన్నీ స్పందిస్తూ.. ‘నేనైతే   ఐదుగురు బౌలర్లతో వెళ్లడమే మంచిదని చెబుతా.  నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు హార్ధిక్ పాండ్యా కూడా ఉండనే ఉన్నాడు. 

Image credit: PTI

ఇలాంటి కఠిన నిర్ణయాల ద్వారా మీరు రిస్కులు తీసుకోవాలి. రిస్కులు తీసుకుంటేనే కదా  రివార్డులు వచ్చేవి..’ అని చెప్పాడు. అయితే సన్నీ చెప్పిన ఐదుగురు బౌలర్ల ఫార్ములా టీమిండియాకు అంత అచ్చిరాలేదు. ఆసియా కప్ లో భారత జట్టు ఓటమికి ఆ ఫార్ములా కూడా ప్రధాన కారణమైంది. 

click me!