ఆ సురేష్ రైనానే, ఈ తిలక్ వర్మలా మళ్లీ వచ్చాడా... ఇద్దరి మధ్య మరీ ఇన్ని పోలికలా...

Published : Aug 14, 2023, 02:52 PM IST

వెస్టిండీస్ టూర్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 2-3 తేడాతో ఓడింది. అయితే ఈ సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు...

PREV
18
ఆ సురేష్ రైనానే, ఈ తిలక్ వర్మలా మళ్లీ వచ్చాడా... ఇద్దరి మధ్య మరీ ఇన్ని పోలికలా...

ఈ సిరీస్‌లో 5 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 173 పరుగులు చేసిన తిలక్ వర్మ, మొదటి 5 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. దీపక్ హుడా 215 పరుగులు, కెఎల్ రాహుల్ 187 పరుగులు చేసి తిలక్ వర్మ కంటే ముందు ఉన్నారు..

28

యాదృచ్ఛికంగా తిలక్ వర్మకీ, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనాకి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. సురేష్ రైనా, తిలక్ వర్మ ఇద్దరూ కూడా నవంబర్‌లోనే పుట్టారు. రైనా, బర్త్ డే నవంబర్ 27న కాగా తిలక్ వర్మ పుట్టినరోజు నవంబర్ 8..

38
Tilak Varma

సురేష్ రైనా, తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయగా, తిలక్ వర్మ కూడా తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదాడు.. 

48

ఐపీఎల్‌లో మొదటి రెండు సీజన్లలో సురేష్ రైనా, తిలక్ వర్మ ఇద్దరూ కూడా 300+ పైగా పరుగులు చేశారు. అప్పటికే టీమిండియా ఆరంగ్రేటం చేసిన సురేష్ రైనా, ఐపీఎల్ 2008లో 421, 2009లో 434 పరుగులు చేశాడు. తిలక్ వర్మ తన మొదటి సీజన్‌లో 397, రెండో సీజన్‌లో 11 మ్యాచులు ఆడి 343 పరుగులు చేశాడు..

58

ఇద్దరూ కూడా 20 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు. టీ20 ఆరంగ్రేటం మ్యాచ్‌లో సురేష్ రైనా 2 క్యాచులు అందుకోగా, వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ కూడా రెండు క్యాచులు అందుకున్నాడు..

68

రెండో టీ20లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసినా, టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది. అలాగే సురేష్ రైనా మొదటి టీ20 హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్‌లోనూ భారత జట్టుకి పరాజయమై ఎదురైంది... రైనా హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించగా, తిలక్ వర్మ హాఫ్ సెంచరీ మ్యాచ్‌లోనూ విండీస్ సరిగ్గా 18.5 ఓవర్లలోనే మ్యాచ్‌ని ఫినిష్ చేసింది..

78

సురేష్ రైనా ఛేదనలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన తిలక్ వర్మ కూడా 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. హాఫ్ సెంచరీ అందుకోలేకపోయాడు..  

88

సురేష్ రైనా తాను వేసిన మొదటి టీ20 ఓవర్‌లోనే వికెట్ తీయగా, వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్‌కి వచ్చిన తర్వాత రెండో బంతికే వికెట్ తీశాడు తిలక్ వర్మ..
 

click me!

Recommended Stories