మాకు పాక్‌తో మ్యాచ్ అయినా ఒకటే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అయినా ఒకటే... రవీంద్ర జడేజా కామెంట్స్..

Published : Aug 14, 2023, 12:37 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. వెస్టిండీస్ టూర్‌ని ముగించుకున్న భారత జట్టు, ఐర్లాండ్ టూర్‌లో మూడు టీ20 మ్యాచులు ఆడి ఆసియా కప్ కోసం లంకకు వెళ్లనుంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..

PREV
16
మాకు పాక్‌తో మ్యాచ్ అయినా ఒకటే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అయినా ఒకటే... రవీంద్ర జడేజా కామెంట్స్..

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 2న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు చాలామంది ఇండియా నుంచి లంకకు వెళ్లేందుకు కూడా ప్లాన్స్ వేసుకుంటున్నారు..

26

‘పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే కచ్చితంగా గెలవాలని అభిమానులు కోరుకుంటారు. మాపైన అంచనాలు చాలా పెరిగిపోతాయి. అయితే మాకు మాత్రం పాకిస్తాన్‌తో మ్యాచ్ అయినా... నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అయినా, ఆస్ట్రేలియాతో మ్యాచ్ అయినా అన్నీ ఒక్కటే..

 

36

పాకిస్తాన్‌ టీమ్‌ని ప్రత్యేకంగా చూడాలని అనుకోవడం లేదు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ అంటే జనాలకు విపరీతమైన క్రేజ్ ఉండొచ్చు. మాకు మాత్రం పాక్ కూడా ఓ సాధారణ ప్రత్యర్థియే. ఎప్పటిలాగే గెలవడానికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తాం..
 

46

బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలనే ఎప్పుడూ అనుకుంటాం. ఏ టీమ్‌ని కూడా చులకనగా చూడం. అయితే కొన్నిసార్లు అనుకున్న ప్లాన్స్ వర్కవుట్ కాకపోవచ్చు. ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి కూడా అంతే. దాన్ని అంగీకరించి తీరాల్సిందే..

56
India vs Pakistan

ఇరు జట్ల ప్లేయర్లు, వారి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు టీమ్స్ కూడా గెలవాలనే ఉద్దేశంతోనే ఆడతాయి. ఆడేటప్పుడు నూటికి 100 శాతం ఇవ్వడమే మా చేతుల్లో ఉంటుంది, రిజల్ట్ ఏమొస్తుందనేది మాత్రం మా చేతుల్లో ఉండదు..

66

మేం కరెక్ట్‌గా ఆడి మ్యాచ్ ఓడిపోతే ఏమీ చేయలేం. అనుకున్న ప్లాన్స్‌ని కరెక్టుగా వర్కవుట్ చేస్తూ ఆడడం మాత్రమే మా చేతుల్లో ఉంటుంది.. దాయాదుల పోరుని ఓ యుద్ధంలా చూడడం మానేస్తేనే బెటర్..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. 

click me!

Recommended Stories