Rohit Sharma: తోడేళ్ల గుంపులో పడేసినా సరే.. ఆ సమూహాన్ని నడిపిస్తూ వస్తాను : వైరల్ అవుతున్న రోహిత్ పాత ట్వీట్

Published : Feb 20, 2022, 11:02 AM IST

Team India Test Skipper Rohit Sharma: టీమిండియా నయా టెస్టు సారథి  రోహిత్ శర్మ కొత్త బాధ్యతల్లో చేరబోతున్నాడు. శ్రీలంకతో జరుగబోయే సిరీస్.. రెడ్ బాల్ క్రికెట్ లో అతడికి తొలి పరీక్ష ఎదురుకానున్నది. ఈ నేపథ్యంలో.. 

PREV
19
Rohit Sharma: తోడేళ్ల గుంపులో పడేసినా సరే.. ఆ సమూహాన్ని నడిపిస్తూ వస్తాను : వైరల్ అవుతున్న రోహిత్ పాత ట్వీట్

టెస్టులలో టీమిండియాకు కొత్త సారథిగా  నియమించబడ్డ రోహిత్ శర్మ.. భారత్ ను అన్ని ఫార్మాట్లలో నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు చేసిన ఓ పాత ట్వీట్.. ఇప్పుడు వైరల్ గా మారింది. 

29

2018లో హిట్ మ్యాన్ తన అభిమానులతో  ట్విట్టర్ వేదికగా ముచ్చటించాడు. ఓ అభిమాని స్పందిస్తూ.. ‘మీ గురించి నిర్వచించే ఒక కొటేషన్ ను చెప్పండి..?’ అని అడిగాడు. 
 

39

దీనికి రోహిత్ శర్మ స్పందిస్తూ.. ‘నన్ను తోడేళ్ల గుంపులో పడేసినా సరే.. ఆ సమూహాన్ని నడిపిస్తూ బయటకు వస్తాను...’ అని  రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ను హిట్  మ్యాన్ ఫ్యాన్స్  వైరల్ చేస్తున్నారు.

49

ఒకప్పుడు జట్టులో స్థానం నిలుపుకోవడమే గగనంగా మారిన రోహిత్ శర్మ.. 2013  ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియాలో తన స్థానాన్ని పర్మనెంట్ చేసుకున్నాడు.
 

59

ఇదిలాఉండగా రోహిత్ ను టెస్టు సారథిగా నియమించడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్  స్పందిస్తూ... ‘మూడు ఫార్మాట్ లలో కచ్చితంగా ఆడే వ్యక్తి గురించి మీరు ఆలోచించుకోవాలి.  అలా ఆలోచిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పేర్లు వస్తాయి.

69

ఇదిలాఉండగా రోహిత్ ను టెస్టు సారథిగా నియమించడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్  స్పందిస్తూ... ‘మూడు ఫార్మాట్ లలో కచ్చితంగా ఆడే వ్యక్తి గురించి మీరు ఆలోచించుకోవాలి.  అలా ఆలోచిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పేర్లు వస్తాయి.

79

ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ చేయడం లేదు.  కావున రోహిత్ శర్మనే కెప్టెన్సీ చేయాల్సి వచ్చింది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు...’ అని గవాస్కర్ చెప్పాడు.

89

వయసు రీత్యా రోహిత్.. టెస్టు సారథ్య బాధ్యతలు తీసుకోబోడని వాదనలు వచ్చినా  అతడు మాత్రం అందుకు అంగీకరించాడు.  భావి కెప్టెన్ ను దృష్టిలో ఉంచుకుని రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా ల పేర్లు కూడా వినిపించినా.. సెలెక్టర్లు మాత్రం హిట్ మ్యాన్ పైనే మొగ్గు చూపారు.  

99

2019లో టెస్టులలోకి అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ.. మూడేండ్లలోనే టెస్టు సారథిగా ఎంపికకావడం విశేషం. ఇప్పటివరకు రోహిత్.. 43 టెస్టులాడి 46.88 సగటుతో 3,047 పరుగులు చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories