టెస్టు సిరీస్ ముగిసింది, రిజల్ట్ ఐసీసీ తేలుస్తుంది... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కామెంట్...

First Published Sep 10, 2021, 5:42 PM IST

ఇంగ్లాండ్, ఇండియా మధ్య మాంచెస్టర్ టెస్టు గురించి ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ టెస్టు మ్యాచ్ రద్దు తర్వాత బాగా ఆలస్యంగా స్పందించిన బీసీసీఐ, ఈ మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తామని... కచ్ఛితంగా పూర్తి చేస్తామని ప్రకటిస్తే... ఈసీబీ మాత్రం మరోలా స్పందించింది...

‘రీషెడ్యూల్ చేసే టెస్టు మ్యాచ్‌కి ఈ సిరీస్‌లో సంబంధం లేదు... అది ఏకైక టెస్టు మ్యాచ్‌గా ఉంటుంది. ఈ టెస్టు సిరీస్‌లో ఇక్కడితో ముగిసింది... 

అయితే టెస్టు సిరీస్ రిజల్ట్ ఏంటనేది ఐసీసీ నిర్ణయిస్తుంది. ఐసీసీ తీసుకునే నిర్ణయం ఇరు జట్లకీ సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా...

టెస్టు సిరీస్‌ ఇలా అర్ధాంతరంగా రద్దు కావడానికి ఐపీఎల్ కారణమని అనుకోవడం లేదు, అది కరెక్ట్ కాదు కూడా...

భారత సారథి విరాట్ కోహ్లీ, అతని టీమ్ టెస్టు క్రికెట్‌లో తమదైన ముద్ర వేయాలనే తపనతో ఉన్నారు. బీసీసీఐ ఈ టెస్టు మ్యాచ్ ఆడడానికి నూరు శాతం ప్రయత్నించింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు...

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి పాయింట్లు చేయాలని ఏ జట్టూ క్రికెట్ ఆడడం లేదు. అయితే ఐసీసీ తీసుకునే నిర్ణయం సరైనదిగా, ఇరు వర్గాలకు న్యాయం చేసేదిలా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హారీసన్...

మాంచెస్టర్‌లోనే ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుందని చెప్పిన హారీసన్, అది కేవలం నేటి మ్యాచ్ రద్దు కావడంతో నిరాశకు గురైన క్రికెట్ ఫ్యాన్స్ కోసమే నిర్వహిస్తామని తెలిపాడు...

ఐసీసీ తీసుకునే నిర్ణయంపైనే ఈ టెస్టు సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. సాధారణంగా అయితే టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్‌కే సిరీస్ విజయం దక్కాలి...

అయితే ఇంగ్లాండ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నా, భారత బృందంలో కరోనా కేసుల కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది...

వాయిదా పడిన టెస్టు, రీషెడ్యూల్ చేసి నిర్వహించినా... అది ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో లెక్కలోకి రాదు. ఎందుకంటే డబ్ల్యూటీసీ రూల్స్ ప్రకారం పాయింట్లు సాధించాలంటే ప్రతీ జట్టూ కనీసం రెండు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.

click me!