‘ఇది విరాట్ కోహ్లీ జట్టు... ఇది ఈ సిరీస్‌లో నిర్మించింది కాదు, ఐదేళ్ల నుంచి విరాట్ కోహ్లీ ఆలోచనల నుంచి ఆవిర్భవించింది. విరాట్ కోహ్లీ క్యారెక్టర్, ఫైటింగ్ స్పిరిట్ జట్టులో ఉండడం వల్లే నేడు ఈ సిరీస్ గెలవగలిగాం...’ అంటూ కామెంట్ చేశాడు కోచ్ రవిశాస్త్రి.

అజయ్ జడేజా కూడా రవిశాస్త్రి వ్యాఖ్యలను సమర్థించాడు. కోహ్లీ లేకపోయినా, భారత జట్టులో అతను నింపిన విజయకాంక్ష ఉండడం వల్లే టీమిండియా చారిత్రక విజయం సాధించిందని కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.

‘వాట్ ఏ విన్... ఎస్... ఆడిలైడ్ తర్వాత మమ్మల్ని అనుమానించిన అందరికీ, మేం నిలబడి సమాధానం చెప్పాం. అద్భుతమైన క్రమశిక్షణ, కసితో జట్టు అంతా కలిసి ఆడింది. వెల్ డన్ ఆల్ ది బాయ్స్, మేనేజ్‌మెంట్... చారిత్రక విజయాన్ని ఎంజాయ్ చేయండి... ఛీర్స్’ అంటూ ట్వీట్ చేశాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ...

గబ్బా పరాజయం తర్వాత ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ... ‘మేం మంచి క్రికెట్ ఆడాం. కానీ వాళ్లు ఆడిన విధానం, వాళ్లు చూపించిన క్రమశిక్షణ అద్భుతం...

రిషబ్ పంత్ ఎలాంటి భయం లేకుండా బ్యాటింగ్ చేశాడు. మా బౌలింగ్ అటాక్‌ను అడ్డుకుని టీమిండియా నిలబడింది... వాళ్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు...

మేం గబ్బాలో ఈజీగా గెలిచేయవచ్చని అనుకున్నాం... ఎప్పుడూ భారతీయులను తక్కువ అంచనా వేయొచ్చు. 120 కోట్ల మందిలో 11 మంది మాత్రమే జట్టులో చోటు దక్కించుకుంటారు..

అంటే జట్టులోకి రావాలంటే ఎంత టాలెంట్ కావాలో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా ప్లేయర్లలో చాలా టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు... అందుకే ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు... రిషబ్ పంత్ తన ఇన్నింగ్స్‌తో బెన్ స్టోక్స్‌ను గుర్తుకు తెచ్చాడు... ’ అంటూ కామెట్ చేశాడు.

గాయంతో ఆఖరి టెస్టులో ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, నాలుగో టెస్టు విజయానంతరం చేసిన ట్వీట్ మంచి స్పందన రాబడుతోంది... మూడో టెస్టులో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ‘గబ్బాలో చూసుకుందాం రా’ అంటూ టిమ్ పైన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

దీని గుర్తు చేసిన అశ్విన్... ‘గుడ్ ఈవెనింగ్ గబ్బా... నేను ఇక్కడ ఆడలేకపోయినందుకు సారీ, కానీ మ్యాచ్‌కి హోస్ట్ చేసినందుకు థ్యాంక్స్... ఈ కష్ట సమయంలో క్లిష్టమైన క్రికెట్ ఆడుతున్నాం. ఈ సిరీస్ ఎప్పటికీ గుర్తుంచుకుంటాం...’ అంటూ టిమ్‌పైన్‌ను, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ను ట్యాగ్ చేశాడు.

‘భారత జట్టులో చాలామంది ప్లేయర్లు గాయపడ్డారు. కానీ ఆస్ట్రేలియా ఆవేశం, కోపం, గర్వం ఇంకా పెద్ద గాయాలు. ఈ టెస్టు సిరీస్ ఓ సినిమా లాంటిది. ఇందులో ప్రతీ ప్లేయర్ హీరోనే, అందులో కొందరు సూపర్ హీరోలు... స్పైడర్ మ్యాన్... స్పైడర్ మ్యాన్ తూనే చురాయా మేరా దిల్ కా చైన్’ అంటూ రిషబ్ పంత్‌ను ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

‘ప్రతీ సెషన్‌లో మనం ఓ కొత్త హీరోని కనుగొన్నాం. గాయపడిన ప్రతీసారి, నిలబడి, మరింత ఎత్తుకి ఎదిగాం... భయపడకుండా ఆడగలమని బౌండరీలు బాది నిరూపించాం, అంతేకాని నిర్లక్ష్యంగా ఆడమని చూపించాం. గాయాలు, ఇబ్బందులన్నీ నమ్మకం, కసితో తుడుచుకుపోయాయి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సిరీస్ విన్... కంగ్రాట్స్ ఇండియా’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.