ఓడిపోతారనే భయంతోనే మాతో సిరీస్‌లు ఆడడం లేదు! టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కామెంట్..

Published : Jul 11, 2023, 04:22 PM IST

దాదాపు 10 ఏళ్లుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలబడుతున్నాయి. గత ఏడాది ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచులు జరగగా అందులో చెరో రెండేసి మ్యాచుల్లో విజయాలు అందుకున్నాయి...

PREV
18
ఓడిపోతారనే భయంతోనే మాతో సిరీస్‌లు ఆడడం లేదు! టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కామెంట్..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం 2016 తర్వాత 7 ఏళ్లకు ఇండియాలో అడుగుపెట్టబోతోంది పాకిస్తాన్. అయితే ఈ విషయంపై పాక్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు..

28
India vs Pakistan

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా ఆడే మ్యాచులన్నీ తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ ఆడే మ్యాచులన్నీ కూడా తటస్థ వేదికపై నిర్వహించాలని పట్టుబడుతోంది పీసీబీ..

38

అయితే ఓడిపోతామనే భయంతోనే పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇష్టపడడం లేదని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. 

48

‘ఇండియా- పాకిస్తాన్ జట్ల మధ్య గౌరవం, స్నేహం ఉండేది.. ఇప్పుడున్న టీముల్లో భారత జట్టు ఒక్కటే, పాకిస్తాన్‌‌తో సిరీస్‌లు ఆడడం లేదు. వాళ్లు ఎందుకు ఆడడం లేదంటే పాక్ టీమ్, అంత పటిష్టంగా ఉంది మరి..

58

ఇంతకుముందు కూడా మాతో మ్యాచులు ఆడినప్పుడల్లా ఓడిపోయేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. 2023లో ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకుంటే మంచిది. 

68
India vs Pakistan

ఇప్పుడు చిన్న టీమ్ లేదు, పెద్ద టీమ్ లేదు.. ఆ రోజు ఏ టీమ్ బాగా ఆడితే అదే గెలుస్తుంది. భారత జట్టు కూడా పాక్ టీమ్‌లాగే బలంగా ఉంది. యాషెస్ సిరీస్‌లో ఏ జట్టు బలమైనదో చెప్పగలమా? అలాగే ఇండియా, పాకిస్తాన్‌లలో ఏ టీమ్ బలమైనదో చెప్పలేం..

78

ఇరు జట్ల మధ్య సంబంధాలు మెరుగు అవ్వాలంటే వరుసగా టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగాలి. అందుకే బీసీసీఐ ముందుకు వస్తే బాగుంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. 

88
India vs Pakistan

జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి చిన్న టీమ్స్‌తో గెలవడానికి కూడా అపసోపాలు పడే పాకిస్తాన్ టీమ్‌తో ఆడేందుకు టీమిండియా భయపడుతుందని అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు... కామెడీగా ఉన్నాయని భారత క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.. 

click me!

Recommended Stories