ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌ మీద సెంచరీ చేయడం కూడా గొప్పేనా... విరాట్ సెంచరీపై మార్క్ వా కామెంట్...

Published : Mar 15, 2023, 12:07 PM IST

మూడున్నరేళ్లుగా టెస్టుల్లో సెంచరీ మార్కును అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఆ ఫీట్ సాధించాడు. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌లో దాదాపు 10 గంటల పాటు పాతుకుపోయి 186 పరుగులు చేసి, 14 పరుగుల దూరంలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు...  

PREV
16
ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌ మీద సెంచరీ చేయడం కూడా గొప్పేనా... విరాట్ సెంచరీపై మార్క్ వా కామెంట్...
Image credit: PTI

మూడేళ్ల తర్వాత టెస్టుల్లో వచ్చిన ఈ సెంచరీ, విరాట్ కోహ్లీకి టెస్టుల్లో పదో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును తెచ్చిపెట్టింది. 1205 రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ... 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ బాదిన విరాట్, మళ్లీ టెస్టు సెంచరీ అందుకోవడానికి మార్చి 2023 దాకా ఎదురుచూడాల్సి వచ్చింది..
 

26
Image credit: PTI

అయితే ఈ సెంచరీ, విరాట్ రేంజ్‌కి తగినది కాదంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా... ‘ఎట్టకేలకు సుదీర్ఘ విరామం అంతమైపోయింది. గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఇప్పటి నుంచి విరాట్ కోహ్లీ మళ్లీ పాత స్టైల్‌లో సెంచరీల మీద సెంచరీలు చేస్తాడని ఆశించవచ్చు...
 

36
Image credit: PTI

అతను ఎంతో ఓపికగా క్రీజులో కుదురుకుపోయి సెంచరీ అందుకున్నాడు. బౌలర్లకు తగిన గౌరవం ఇస్తూ చాలా తక్కువ రిస్కీ షాట్లు ఆడాడు. అయితే బ్యాటింగ్ పిచ్ మీద సెంచరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ ప్లేయర్‌కి ఇది చాలా చిన్న విషయం...

46
Image credit: PTI

విరాట్ కోహ్లీ బెస్ట్ సెంచరీల్లో దీన్ని లెక్కించకూడదు. ఎలా వచ్చినా సెంచరీ వచ్చినట్టే. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే, అది దీన్ని మించినది అవుతుంది..

56
Image credit: PTI

విరాట్ లాంటి టాప్ క్లాస్ ప్లేయర్, ఇన్ని నెలల పాటు సెంచరీ అందుకోవడానికి కష్టపడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా...

66

టెస్టు సిరీస్ ముగించుకున్న టీమిండియా, మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది వన్డేల్ల రెండు సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, వన్డే సిరీస్‌లో కీ ప్లేయర్‌గా మారబోతున్నాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 ఉండడంతో ఈ వన్డే సిరీస్‌పై హైప్ బాగా పెరిగిపోయింది.. 

Read more Photos on
click me!

Recommended Stories