పృథ్వీ షాని వదలని సప్న గిల్... పలుకుబడితో అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపిస్తూ బాంబే హై కోర్టుకి...

Published : Mar 15, 2023, 11:17 AM IST

సెల్ఫీ ఇవ్వలేదని క్రికెటర్ పృథ్వీ షా కారును వెంబడించి, కారు అద్దాలు పగులకొట్టి రచ్చ రచ్చ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్, టిక్ టాకర్, మోడల్, భోజ్‌పురి హీరోయిన్ సప్న గిల్, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేలా కనిపించడం లేదు. ఇది జరిగిన నెల రోజులకు మరోసారి వార్తల్లో నిలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది సప్న గిల్..

PREV
18
పృథ్వీ షాని వదలని సప్న గిల్... పలుకుబడితో అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపిస్తూ బాంబే హై కోర్టుకి...
Prithvi Shaw attack

క్రికెటర్ పృథ్వీ షాతో గొడవ పడిన తర్వాత సప్న గిల్,ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య రెట్టింపు అయ్యింది, ఆమె గురించి దేశమంతా మాట్లాడుకోవడం మొదలెట్టింది. ఒక్కసారిగా ఇంత అటెన్షన్ రావడంతో ఈ రచ్చ మరింత పెంచుతూ వార్తల్లో నిలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది సప్న గిల్.. 

28

ఫిబ్రవరి 15న ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో క్రికెటర్ పృథ్వీ షాని చూసిన సప్న గిల్, తన స్నేహితులతో కలిసి అతనితో సెల్ఫీ దిగాలని చూసింది. అయితే పృథ్వీ షా, వారికి సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించడంతో అతన్ని వెంబడించి బేస్‌బాల్ బ్యాటుతో క్రికెటర్ కారుపై దాడి చేసింది.

38

ఈ దాడిలో పృథ్వీ షా ప్రయాణిస్తున్న కారు అద్ధాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా క్రికెటర్ నుంచి రూ.50 వేల నగదుని డిమాండ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సప్న గిల్‌ని రిమాండ్‌లోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.

48

నేరం నిరూపితం కావడంతో ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది ముంబైలోని స్థానిక న్యాయ స్థానం... 5 రోజుల తర్వాత రిమాండ్ తర్వాత బెయిల్ ద్వారా బయటికి వచ్చిన సప్న గిల్, రివర్సులో పృథ్వీ షాపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. బెయిల్ ద్వారా బయటికి వచ్చిన సమయంలోనే లాయర్‌తో కలిసి నవ్వుతూ కెమెరాకి ఫోజులు ఇచ్చింది సప్న గిల్..
 

58

పృథ్వీ షాపై పలు కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది సప్న గిల్. చెప్పినట్టుగానే ఏకంగా 10 సెక్షన్ల కింద కేసులు పెట్టింది.. అది పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో తాజాగా తనపై పృథ్వీ షా కేసులో పెట్టిన తనపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ని రద్దు చేయాలని కోరుతూ బాంబే హై కోర్టును ఆశ్రయించింది..

68

సప్న గిల్ తరుపు లాయర్ అలీ కశీష్ దేశ్‌ముఖ్, బాంబే హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో గిల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేయవద్దని ఓషివారా పోలీసులను ఆదేశించాలను కోరాడు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు, క్రికెటర్ పృథ్వీ షా దగ్గర్నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని, సప్న గిల్‌పై అన్యాయంగా కేసులు పెట్టారని, దీన్ని అధికార దుర్వినియోగంగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు..

78

ఫిబ్రవరి 15న క్రికెటర్ పృథ్వీ షాపై జరిగిన దాడి కేసులో ఓషివారా పోలీసులు, ఐదుగురిని అరెస్ట్ చేశారు. పృథ్వీ షా ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దాడి, బెదిరింపుల సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  

88

ఫిబ్రవరి 25న ఎయిర్‌పోర్ట్ పోలీసులను ఆశ్రయించిన సప్న గిల్, పృథ్వీ షాతో పాటు అతని స్నేహితులు ఆశీష్ సురేంద్ర యాదవ్, బ్రిజేశ్ తదితరులపై లైంగిక వేధింపులతో పాటు తన పరువుకి భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకు సెక్షన్ 34, 120బీ, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సిందిగా కోరింది. అయితే సంఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని చెప్పిన ఎయిర్‌పోర్ట్ పోలీసులు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.. 

click me!

Recommended Stories