వన్డే వరల్డ్ కప్ ఆడే టీమ్ ఇది కాదు! కాబట్టి సమస్యే లేదు... టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్స్...

Published : Aug 14, 2023, 11:39 AM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, రవిశాస్త్రి కోచింగ్‌లో 2017 నుంచి 2021 అక్టోబర్ వరకూ ద్వైపాక్షిక సిరీసుల్లో 80 శాతం విజయాలను అందుకుంది భారత జట్టు. అయితే కోహ్లీ కెప్టెన్సీ నుంచి, రవిశాస్త్రి హెడ్ కోచ్ పొజిషన్ నుంచి తప్పుకున్నాక టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ 68 శాతానికి పడిపోయింది..

PREV
16
వన్డే వరల్డ్ కప్ ఆడే టీమ్ ఇది కాదు! కాబట్టి సమస్యే లేదు... టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్స్...

స్వదేశంలో జరుగుతున్న సిరీసుల్లో ప్రతాపం చూపిస్తున్న టీమిండియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి చిన్న జట్లపై కూడా సిరీస్‌లు ఓడిపోయింది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్నాక టీమిండియాకి 8 మంది కెప్టెన్లుగా చేశారు..

26

‘వెస్టిండీస్ టూర్‌లో టీమ్‌ కాంబినేషన్ సెట్ చేయడానికి మాకు అవకాశం దొరకలేదు. అయితే స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ విషయంలో ఎలాంటి కంగారు లేదు. ఎందుకంటే అక్కడ ఆడే టీమ్ ఇది కాదు..
 

36
KL Rahul-Dravid

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడిన ప్లేయర్లలో కొందరు మాత్రమే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో ఆడతారు. ఈ పర్యటన ద్వారా కొన్ని లోపాలు బయటపడ్డాయి. వాటిని పరిష్కరించేందుకు మార్గాలు వెతుకుతాం...

46

బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ పెరగాల్సిన అవసరం ఉంది. ఉన్నంతలో బ్యాటింగ్ చేయగల బౌలర్లను ఎంపిక చేస్తే ఈ సమస్యను తగ్గించవచ్చు. అలాగని బౌలింగ్ యూనిట్‌ని బలహీనపర్చకుండా జాగ్రత్త పడాలి..

56

వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ని చూస్తే 11వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే అల్జెరీ జోసఫ్ కూడా బ్యాటింగ్ చేయగలడు. అలాంటి టీమ్‌తో ఆడుతున్నప్పుడు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ అవసరం. టీ20 గేమ్ ఆటతీరు రోజురోజుకీ స్పీడ్ పెరుగుతోంది..

66

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జట్టులోనూ మార్పులు చేయాలి. అవును, కచ్ఛితంగా టీమిండియా ముందు కొన్ని ఛాలెంజ్‌లు ఉన్నాయి. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. 

click me!

Recommended Stories