చిట్టీలు వేసి ప్లేయర్లను సెలక్ట్ చేస్తే, ఇలాగే ఉంటుంది! సిల్లీ స్టేట్‌మెంట్స్ ఇవ్వకుండా... మరోసారి వెంకీ ఫైర్

Published : Aug 14, 2023, 11:04 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ చేతుల్లో టీ20 సిరీస్‌ని కోల్పోయి, ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది భారత జట్టు. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి తమ ప్రతాపం చూపిద్దామనుకున్న టీమిండియాకి, ఊహించని షాకులే తగిలాయి..  

PREV
110
చిట్టీలు వేసి ప్లేయర్లను సెలక్ట్ చేస్తే, ఇలాగే ఉంటుంది! సిల్లీ స్టేట్‌మెంట్స్ ఇవ్వకుండా... మరోసారి వెంకీ ఫైర్
Hardik Pandya

రెండో వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు, మూడో వన్డేలో ప్రతాపం చూపించి 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచినా, టీ20 సిరీస్‌లో మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడి, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో వరుసగా గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చినా... ఫైనల్‌లో చేతులు ఎత్తేసింది..

210

నాలుగో టీ20లో భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన తర్వాత కూడా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్నాడు హార్ధిక్ పాండ్యా. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని వేళలా పనికి రాదని, వెస్టిండీస్ టీమ్ గట్టి సమాధానమే ఇచ్చింది. ఈ పరాజయం తర్వాత భారత జట్టుపై మరోసారి తన లెవెల్‌లో విరుచుకుపడ్డాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్...

310

‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు ఆటతీరు రోజురోజుకీ దిగజారుతోంది. కొన్ని నెలల క్రితం టీ20 వరల్డ్ కప్‌కి కూడా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. అంతకుముందు బంగ్లాదేశ్‌తోనూ వన్డే సిరీస్ ఓడారు..

410

ఇకనైన మనవాళ్లు సిల్లీ స్టేట్‌మెంట్స్ ఇవ్వకుండా, టీమ్‌ని బాగుచేసేందుకు ఏం చేయాలో ఆత్మపరిశీలన చేసుకోవాలి..’ అంటూ ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్. ఈ ట్వీట్ వేసి ఊరుకోకుండా తన ట్వీట్‌పై వ్యంగ్యంగా కామెంట్ చేసిన ప్రతీ ఒక్కరికీ తన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు ఈ మాజీ క్రికెటర్...

510

‘వెస్టిండస్, టీ20 వరల్డ్ కప్‌కి కాదు, వన్డే వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. అదీకాకుండా వాళ్లు రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచారు..’ అంటూ ఓ నెటిజన్, వెంకీ ట్వీట్‌పై కామెంట్ చేశాడు. 
 

610

‘నీకు తెలియనిది ఏంటంటే, వాళ్లు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మాత్రమే కాదు, గత ఏడాది టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో ఓడారు. వాళ్ల కంటే నెదర్లాండ్స్, ఐర్లాండ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ బాగా ఆడి టీ20 వరల్డ్ కప్‌ టోర్నీ ఆడాయి..’ అంటూ సమాధానం ఇచ్చాడు వెంకటేశ్ ప్రసాద్..

710

‘ఇలాంటి పర్ఫామెన్స్ చూస్తుంటే చాలా బాధేస్తోంది. టీమ్‌లో చాలా ప్రక్షాళనలు చేయాలి. పైపైన కొన్ని మార్పులు చేసి అంతా బాగుందని అనుకుంటే ఇలాగే ఉంటుంది. టీమ్‌లో గెలవాలనే కసి, ఆకలి కనిపించడమే లేదు..

810
Hardik Pandya

టీమిండియా కెప్టెన్, టీమ్‌ మేనేజ్‌మెంట్ ఈ పరాజయానికి సమాధానం చెప్పాలి. ఏమన్నా అంటే నేర్చుకుంటున్నాం, ప్రాసెస్ చేస్తున్నాం అనే పదాలను వాడి తప్పించుకుంటున్నారు. ధోనీ ఈ మాటలు వాడేవాడు. ఇప్పుడు అందరూ దీన్ని తప్పుగా వాడుకుంటున్నారు..

910

సెలక్షన్‌లో సరైన పక్షపాతం ఉండడం లేదు. చిట్టీలు వేసి ప్లేయర్లను సెలక్ట్ చేసినట్టు చేస్తున్నారు. స్కిల్స్ టెస్టును మరింత పెంచాలి. కెప్టెన్ అయితే ఏం జరుగుతుందో తెలియనట్టు కళ్లు తేలిసి చూస్తున్నాడు. 

1010

మన బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు, బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు. నీకు నచ్చిన ప్లేయర్లు టీమ్‌లో ఉండాలని చెప్పి, మ్యాచులు ఓడిపోతున్నా కళ్లు మూసుకుని తలాడించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు వెంకటేశ్ ప్రసాద్..

click me!

Recommended Stories