అలాంటి ప్రశ్నలతో బాబర్ ఆజమ్‌‌ని మానసికంగా వేధిస్తున్నారు... రిపోర్టర్లపై మిస్బా వుల్ హక్ ఫైర్...

First Published Jan 13, 2023, 2:05 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో స్వదేశంలో ఒక్క టెస్టు విజయం కూడా అందుకోలేకపోయింది పాకిస్తాన్. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ని 3-0 తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టులను డ్రా చేసుకుంది...

టెస్టు కెప్టెన్‌గా పాకిస్తాన్‌కి విజయాలు అందించలేకపోతున్న బాబర్ ఆజమ్, వైట్ బాల్ క్రికెట్‌లో బాగానే సక్సెస్ అందుకుంటున్నాడు. బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టుపై మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ విజయం అందుకుంది పాకిస్తాన్...

ఆసియా కప్ 2022 టోర్నీలో ఫైనల్ చేరిన పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, జింబాబ్వే చేతుల్లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా లక్కీగా ఫైనల్ ఆడింది. అయితే రెండు టోర్నీల్లోనూ పాకిస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది...

Babar Azam

బాబర్ ఆజమ్‌కి పాక్ మీడియా నుంచి దక్కాల్సిన సపోర్ట్ దక్కడం లేదు. స్వదేశంలో కూడా టెస్టు మ్యాచ్ గెలిపించలేకపోయిన బాబర్ ఆజమ్‌, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటావా? అని ప్రశ్నించాడు ఓ రిపోర్టర్.. ఈ ప్రశ్నకు తన స్టైల్‌లో ఏదో సమాధానం చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు బాబర్ ఆజమ్...

‘క్రికెట్ నా ప్రాణం. ప్రతీ క్రికెట్ మ్యాచ్ చూస్తాను, క్రికెట్ గురించి ప్రతీ ఆర్టికల్ చదువుతాను. బాబర్ ఆజమ్‌ని వీక్ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. అతన్ని మానసికంగా దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది...

Babar Azam

ప్రెస్ కాన్ఫిరెన్సుల్లో బాబర్ ఆజమ్‌ని అడుగుతున్న ప్రశ్నలను గమనిస్తున్నా. ప్రతీ మ్యాచ్‌లో గెలుపు, ఓటములు సహజం. ఇలాంటి ప్రశ్నలు వేయడం వల్ల బాబర్ ఆజమ్‌ మెంటల్‌గా వీక్ అవుతాడు...

రిపోర్టర్లు వేసే ఇలాంటి ప్రశ్నలు, టీమ్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని కూడా పాడు చేస్తాయి. టీమ్‌కి ఏది అవసరమో అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ప్లేయర్లు, సెలక్షన్ కమిటీ, బోర్డు కలిసి నిర్ణయానికి రావాలి...

misbah ul haq

ఇలాంటి ప్రశ్నలతో బాబర్ ఆజమ్‌ని మానసికంగా దెబ్బ తీయడం పాక్‌ క్రికెట్ టీమ్‌కి కూడా కరెక్ట్ కాదు.. మాటిమాటికీ మార్పులు చేయడం మంచిది కాదు. టెస్టుల్లోనూ పాక్‌కి మంచి టీమ్ ఉంది కానీ మార్పులతో జట్టును నాశనం చేస్తున్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ మిస్బా వుల్ హక్...

click me!