ఏడాదికి 60 మందిని ఆడిస్తున్నారు, ఒక్కడైనా పనికొచ్చాడా... టీమిండియాపై పాక్ మాజీ షాకింగ్ కామెంట్లు...

First Published Oct 7, 2022, 4:32 PM IST

2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది భారత క్రికెట్ జట్టు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2014, 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఫెయిల్ అయిన భారత జట్టు, 2015 వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ నుంచి నిష్కమించింది...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలతో పాటు 2019-21 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడబోతోంది భారత జట్టు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించిన భారత జట్టు, ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టింది. గత ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో మొట్టమొదటిసారి పాక్ చేతుల్లో పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది భారత జట్టు. అది కూడా 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా...

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 23న దాయాది పాకిస్తాన్‌తో తలబడుతోంది టీమిండియా. ఇరు జట్ల మధ్య ఏడాది గ్యాప్‌లో జరగబోతున్న నాలుగో మ్యాచ్ ఇది. ఈసారి గత వరల్డ్ కప్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది భారత జట్టు...

‘టీమిండియా మెయిన్ ప్లేయర్లను పక్కనబెట్టి, కొత్త కొత్త ప్లేయర్లను మారుస్తూ వస్తోంది. ఏడాదిలో 56- 57 మంది కొత్త ప్లేయర్లను ఆడిస్తున్నారు. అయితే వారిలో ఒక్కడైనా మ్యాచ్ విన్నర్ ఉన్నాడా? ఒక్కరైనా ఐసీసీ టైటిల్‌ని గెలిపించగలిగారా?

టీమిండియా కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు బాగా ఆడతాయి, ఆడుతున్నాయి. ఆ తర్వాత పాకిస్తాన్ పర్ఫామెన్సే బాగుంది... ఈసారి కూడా భారత్‌పై పాక్ ఆధిపత్యం చూపిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్...

Rishabh Pant

2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత 8 సార్లు ఐసీసీ టోర్నమెంట్స్‌లో నాకౌట్ స్టేజీల్లోకి అర్హత సాధించిన భారత జట్టు, 3 సార్లు ఫైనల్ ఆడింది. అయితే టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.. 

click me!