హార్దిక్, ధావ‌న్ మాత్రమే కాదు.. విడాకులు తీసుకున్న భారత క్రికెటర్లు ఎవరో తెలుసా?

First Published | Jul 20, 2024, 10:24 AM IST

divorced Indian cricketers : భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త‌న నాలుగు సంవ‌త్స‌రాల వివాహ బంధాన్ని తెంచుకున్నాడు. భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోతున్నట్లు ప్ర‌క‌టించాడు. అయితే విడాకులు తీసుకున్న తొలి భారతీయ క్రికెటర్ హార్దిక్ మాత్రమే కాదు.. ఇదివ‌ర‌కే విడాకులు తీసుకున్న క్రికెటర్లు  చాలా మందే ఉన్నారు. విడాకులు తీసుకున్న భార‌త క్రికెట‌ర్లను గ‌మ‌నిస్తే..
 

divorced Indian cricketers, hardik, Dhawan, dk

హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా - నటాషా తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తాము విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇద్దరూ 31 మే 2020 న వివాహం చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. మరోసారి 14 ఫిబ్రవరి 2023న ఉదయపూర్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 

శిఖర్ ధావన్

టీమిండియా మాజీ ఓపెనింగ్ ప్లేయ‌ర్ శిఖర్ ధావన్ కూడా విడాకుల బాధను అనుభ‌వించాడు. శిఖర్ ధావన్ తన మాజీ భార్య అయేషా ముఖర్జీని ఫేస్‌బుక్‌లో కలిశాడు. అతను 2009లో మెల్‌బోర్న్‌లో ఆయేషా ముఖర్జీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. 2012లో వివాహం జ‌రిగింది. అయేషా, శిఖర్‌లకు జోరావర్ ధావన్ అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆయేషా కొన్నాళ్లుగా తన కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటూ, ఇండియాకు రావడానికి నిరాకరించి, శిఖర్‌ను కొడుకుకు దూరంగా ఉంచింది. ఇద్దరికీ పెళ్లయి 11 ఏళ్లు అయింది. 2023లో ఢిల్లీలోని కోర్టు శిఖర్ ధావన్, అయేషాల విడాకులను అనుమతించింది.

Latest Videos


Mohammed Shami , shami

మహ్మద్ షమీ (కోర్ట్ కేసు పెండింగ్)

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 2014లో హసిన్ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హాసిన్ జహాన్ ఛీర్‌లీడర్. పెళ్లయిన 4 ఏళ్ల తర్వాత, షమీకి ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయనీ, 2018లో గృహహింసకు గురిచేశాడ‌ని ఆమె బహిరంగంగా ఆరోపించింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. అయితే ఈ రెండు కేసులు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. షమీకి హసిన్ జహాన్‌తో పాటు ఒక కుమార్తె కూడా ఉంది.

మహ్మద్ అజారుద్దీన్

భారత జట్టు మాజీ కెప్టెన్‌గా మహ్మద్ అజారుద్దీన్ ఒక్కసారి కాదు రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు. మహ్మద్ అజారుద్దీన్ వ్యక్తిగత జీవితం చాలా వివాదాస్పదమైంది. అజారుద్దీన్ మొదట నౌరీన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి అసదుద్దీన్, అయాజుద్దీన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 1996లో, అతను నౌరీన్‌తో విడాకులు తీసుకున్నాడు. బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకున్నాడు, అయితే ఆమెతో కూడా 14 సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకున్నాడు.

వినోద్ కాంబ్లీ

భారత మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్‌ను 1998లో వివాహం చేసుకున్నాడు. తన భార్యను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. వారి సంబంధం 2005లో తెగిపోయింది. ఆ త‌ర్వాత వినోద్ కాంబ్లీ మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Dinesh Karthik

దినేష్ కార్తీక్

దినేష్ కార్తీక్ గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను వివాహం చేసుకున్నాడు. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, దినేష్ స్నేహితుడు మురళీ విజయ్‌తో నికిత ఎఫైర్ పెట్టుకోవడం వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత దినేష్, నికిత విడాకులు తీసుకున్నారు.

మనోజ్ ప్రభాకర్

మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ మొదటి భార్య సంధ్య. అయితే, సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2013లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. సంధ్య మనోజ్‌పై వరకట్న వేధింపుల ఆరోపణలు చేయడంతో వీరి వివాహ బంధం తెగిపోయింది. ఆ తర్వాత మనోజ్ ప్రభాకర్ నటి ఫర్హీన్‌ని పెళ్లాడాడు.

జవగల్ శ్రీనాథ్

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ 1999లో జ్యోస్నను వివాహం చేసుకున్నాడు, కానీ 8 సంవత్సరాల తర్వాత 2007లో వీరు విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత జర్నలిస్ట్ మాధవి పట్రావాలిని వివాహం చేసుకున్నాడు.

click me!