IPL 2022: పైసా వసూల్.. తీసుకున్న డబ్బులకు న్యాయం చేస్తున్నారు.. ఎవరా మ్యాచ్ విన్నర్లు..?

Published : Apr 25, 2022, 06:18 PM IST

TATA IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి పది జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను  దక్కించుకున్నాయి.  వీరిలో కొంతమంది అంచనాలకు మించి రాణిస్తే మరికొందరేమో అసలు  వీళ్లనెందుకు కొనుగోలు చేశాంరా దేవుడా..? అన్నట్టుగా ఆడుతున్నారు. 

PREV
112
IPL 2022: పైసా వసూల్.. తీసుకున్న డబ్బులకు న్యాయం చేస్తున్నారు.. ఎవరా మ్యాచ్ విన్నర్లు..?

ఐపీఎల్-15 మెగా వేలంలో సుమారు 600  మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 217 స్లాట్లకు గాను 214 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. గతంలో రూ. 20 లక్షలు పలికినోళ్లు ఇప్పుడు పది కోట్లకు అమ్ముడయ్యారు. అసలు వీళ్లను ఎవరైనా దక్కించుకుంటారా..? అనుకున్న ఆటగాళ్లు కోట్లాది రూపాయలు  పలికారు. మరి వీరిలో విజయవంతమైనోళ్లు ఎవరు..? 

212

1. తిలక్ వర్మ : ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఈ తెలుగు కుర్రాడిని వేలంలో ముంబై రూ. 1.7 కోట్లు పెట్టి దక్కించుకున్నది. ఈ ఐపీఎల్ లో  ముంబై వరుసగా 8 పరాజయాల పాలైనా ఆ జట్టులో నిలకడగా రాణిస్తున్న ఆటగాడు తిలక్ వర్మ ఒక్కడే. అతడు ఆడిన ప్రతి ఇన్నింగ్ కూడా ముంబైల ఆపదలో ఉన్నప్పటిదే. 

312

8 ఇన్నింగ్స్ లలో 45.33 సగటుతో 272 పరుగులు చేశాడు తిలక్. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, ఇషాన్ కిషన్ వంటి స్టార్లు విఫలమైన చోట తిలక్ రాణిస్తున్నాడు. ప్రస్తుతం తిలక్ వర్మ.. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఐదో బ్యాటర్ గా ఉన్నాడు. 
 

412

2. రాహుల్ చాహర్ :  గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇతడిని ఈసారి వేలంలో పంజాబ్ దక్కించుకుంది. రూ. 5.25 కోట్లకు పంజాబ్ కు ఆడుతున్న  చాహర్..  ఆ జట్టుకు అవసరమున్నప్పుడల్లా వికెట్ పడగొడుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచులాడిన చాహర్.. 10 వికెట్లు తీశాడు.  కట్టుదిట్టంగా బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్లను నిలువరిస్తున్నాడు. 

512

3. ఉమేశ్ యాదవ్ : వెటరన్ ఇండియన్ పేసర్ ఉమేశ్ యాదవ్  కథ దాదాపు ముగిసినట్టే అనుకున్నారంతా. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఉమేశ్   సంచలన స్పెల్స్ తో ఆకట్టుకుంటున్నాడు.  పవర్ ప్లే లలో కేకేఆర్ కు శుభారంభాలు అందిస్తున్నాడు. పాట్ కమిన్స్, టిమ్ సౌథీ వంటి  ప్రపంచ స్థాయి బౌలర్లున్నా  కేకేఆర్ యాజమాన్యం మాత్రం ఉమేశ్ కే వరుస అవకాశాలిస్తున్నది. ఉమేశ్ ఇప్పటివరకు 8  మ్యాచులలో 11 వికెట్లు తీశాడు. 

612

4. కుల్దీప్ యాదవ్ :  2020 సీజన్ లో కేకేఆర్ తరఫున ఆడిన కుల్దీప్ ను ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. 2020 సీజన్ లో  తన ఫామ్ కోల్పోయి తంటాలు పడిన కుల్దీప్ తర్వాత జాతీయ జట్టులో కూడా స్థానం కోల్పోయాడు. ఇక అతడు కమ్ బ్యాక్ కష్టమే అనుకున్నారు. కానీ ఈ మణికట్టు స్పిన్నర్.. 7 మ్యాచులలో 13 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కుల్దీప్.. మూడో స్థానంలో నిలిచాడు. 

712

5. రాబిన్ ఊతప్ప : వయసు అయిపోయింది ఇక  అతడు ఏం ఆడతాడు..? అనుకున్నారంతా.. వేలంలో రాబిన్ ఊతప్ప కు చెన్నై రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే అవి వృథా అని కామెంట్ చేశారు. కానీ ఈ సీజన్ లో చెన్నై జట్టుగా విఫలమైనా ఊతప్ప మాత్రం బ్యాటర్ గా సక్సెస్ అయ్యాడు. గతేడాది ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ వరుసగా వైఫల్యం చెందుతున్నా రాబిన్ మాత్రం.. ఈ సీజన్ లో ఇప్పటివరకు  7 మ్యాచులలో 227 పరుగులు చేశాడు. 

812

6. అయుష్ బదోని : ఈ ఢిల్లీ కుర్రాడిని  లక్నో తీసుకున్నది  రూ. 20 లక్షలకు మాత్రమే. కానీ కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన మనీష్ పాండే, స్టాయినిస్, దీపక్ హుడాల కంటే  అద్భుతంగా రాణిస్తున్నాడు బదోని. ఆరు ఇన్నింగ్స్ లలో 120 పరుగులే చేసినా అవి లక్నో కు ఎంతో ఉపయోగపడే పరుగులే. ప్రస్తుతం లక్నోలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో బదోని నాలుగో స్థానంలో ఉన్నాడు. 

912

7. డేవిడ్ వార్నర్ : సుమారు ఆరేండ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు సారథిగా ఉన్న  వార్నర్ గతేడాది పలు కారణాల వల్ల ఆ జట్టును వీడాడు. వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్.. 6.25 కోట్లకు దక్కించుకుంది.  వార్నర్.. ఢిల్లీ ఆడిన తొలి మూడు మ్యాచులకు అందుబాటులో లేకపోయినా తర్వాత మాత్రం  దుమ్ముదులుపుతున్నాడు.  బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో పాటు జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఐదు ఇన్నింగ్స్ లలో కలిపి వార్నర్ ఇప్పటివరకు 219 రన్స్ చేశాడు. బ్యాటర్ గానే గాక  రిషభ్ పంత్ కు అవసరమైన సందర్బాలలో కెప్టెన్సీ సాయం కూడా చేస్తున్నాడు.

1012

8. దినేశ్ కార్తీక్ : టీమిండియా వెటరన్ క్రికెటర్  దినేశ్ కార్తీక్ ఈస్థాయిలో ఆడతాడని కనీసం అతడు కూడా ఊహించి ఉండడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడుతూ  ప్రతి మ్యాచ్ లో అతడు  ఆపద్భాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. ఫినిషర్ గా వచ్చి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్ లలో 210 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కార్తీక్ రెండో స్థానంలో ఉన్నాడు. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తున్న కార్తీక్.. తాజా ప్రదర్శనతో  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు పోటీగా మారాడు. రూ. 5.50 కోట్లతో అతడిని ఆర్సీబీ దక్కించుకుంటే అంతకుమించిన  ఆటను ఆడుతున్నాడు. 

1112

9. టి. నటరాజన్ : ఈ సీజన్ కు ముందు నటరాజన్ భవితవ్యం ప్రశ్నార్థకం. గతేడాది ఐపీఎల్ సీజన్ సందర్బంగా గాయపడ్డ అతడు అర్థాంతరంగా తప్పుకున్నాడు. తిరిగి ఫిట్నెస్ సాధించి  మళ్లీ జాతీయ సెలెక్టర్ల దృష్టి పడ్డా కరోనా సోకింది. దీంతో మళ్లీ కొన్నాళ్లు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. కానీ అతడిపై సన్ రైజర్స్ నమ్మకముంచింది.  వేలంలో రూ. 4 కోట్లు పెట్టి దక్కించుకుంది. దానికి తగ్గట్టుగానే  నట్టూ కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు  7 మ్యాచులాడి 15 వికెట్లు నేల కూల్చాడు.  కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు అవసరమున్నప్పుడల్లా నట్టూ.. తన యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. 

1212

10. యుజ్వేంద్ర చాహల్ :  ఈ సీజన్ లో ఆర్సీబీకి సర్ప్రైజ్ ప్యాకేజీలా దొరికాడు  చాహల్. 8 ఏండ్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడినా అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో చాహల్ ను వేలంలో రాజస్తాన్ దక్కించుకుంది. రూ. 6.5 కోట్లతో  చాహల్ ను దక్కించుకున్న  రాజస్తాన్.. అతడు ఇంతలా రాణిస్తాడని ఊహించి ఉండదు. కానీ ఏకంగా  ఆడిన 7 మ్యాచుల్లో అతడే ప్రధాన బౌలర్ గా మారుతున్నాడు. 7 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ ఒకటి ఉండగా.. ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ఒక లెక్క ప్రకారం.. ఈ సీజన్ లో ఇప్పటివరకు  ప్రతి 9 బంతులకు చాహల్ వికెట్ తీస్తున్నాడు.  చాహల్ ప్రదర్శన చూసి ఆర్సీబీ అభిమానులు దుఖ్ఖించడం మినహా మరేమీ చేయలేని దయనీయ స్థితిలో ఉన్నారు. 

click me!

Recommended Stories