ఐపీఎల్ 2022 సీజన్‌లో భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ హార్డ్ టైం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో రెండు సార్లు రనౌట్ అయిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో వరుసగా గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...
విరాట్ కోహ్లీ వరుసగా విఫలం అవుతుండడంతో టీమిండియా మాజీ కెప్టెన్ టైం అయిపోయిందని, అతను రిటైర్మెంట్ ప్రకటించేస్తే బెటర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది ఫ్యాన్స్...
27
విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతూ... పేలవ ప్రదర్శన ఇస్తుండడంతో అతను కొన్నాళ్లు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటే మంచిదని... భారత క్రికెట్ మాజీలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు...
37
గత దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసి ‘ఐసీసీ దశాబ్దపు క్రికెటర్’ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ టెక్నిక్స్, టిప్స్ ఇస్తూ తెగ హడావుడి చేస్తున్నారు మరికొందరు క్రికెట్ విశ్లేషకులు...
47
భారత జట్టుకి అత్యధిక టెస్టు విజయాలు అందించిన భారత మాజీ సారథి విరాట్‌కి ఇక్కడి అభిమానుల నుంచి ట్రోలింగ్ వస్తుంటే... పాక్ ఫ్యాన్స్ మాత్రం ‘కింగ్’ కోహ్లీకి అండగా నిలుస్తున్నారు.
57
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. విరాట్ క్రికెట్ కెరీర్‌లో ఇలా రెండు వరుస ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి...
67
కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయిన తర్వాత పొరుగుదేశం పాకిస్తాన్‌లో విరాట్ పేరు ట్రెండింగ్‌లో కావడం విశేషం. విరాట్ కోహ్లీ GOAT ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ పాక్ ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలిచారు...
77
Virat Kohli
విరాట్ కోహ్లీ కంటే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గొప్ప ప్లేయర్ అంటూ గోల చేసే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్... క్లిష్ట సమయంలో లెజెండరీ క్రికెటర్‌కి అండగా నిలుస్తూ... ఓ మెట్టు ఎక్కేశారు...