అగ్రెషన్ లేదు, అటాకింగ్ బౌలింగ్ లేదు! ఇదీ ఓ కెప్టెన్సీయేనా రోహిత్... విదేశాల్లో టెస్టు గెలవడం అంటే...

Published : Jun 11, 2023, 05:50 PM ISTUpdated : Jun 11, 2023, 06:25 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌ 2023లో టీమిండియా 210 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఎప్పటిలాగే కీలక మ్యాచుల్లో భారత బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో ఐదో రోజు తొలి సెషన్‌లోనే మ్యాచ్ ముగిసిపోయింది..

PREV
110
అగ్రెషన్ లేదు, అటాకింగ్ బౌలింగ్ లేదు! ఇదీ ఓ కెప్టెన్సీయేనా రోహిత్... విదేశాల్లో టెస్టు గెలవడం అంటే...

ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నుంచి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అయితే టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ఒక్క విజయం అందుకోలేకపోయాడు..

210
Rohit Sharma Prank

ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో ఘోర పరాభవాలను చవిచూసిన రోహిత్ సేన, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ చిత్తుగా ఓడింది. నాలుగు రోజుల ఓ సెషన్ పాటు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కరెక్టుగా డామినేట్ చేసింది ఒకే ఒక్క సెషన్ మాత్రమే..

310

ఐసీసీ టోర్నీల్లో టాస్ గెలవడం అంటే సగం మ్యాచ్ గెలిచినట్టే. అయినా ఆ అడ్వాంటేజ్‌ని రోహిత్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌ లేకుండా బరిలో దిగడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది...

410
Rohit Sharma

రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, నాథన్ లియాన్ వంటి స్పిన్నర్లు మూడేసి వికెట్లు తీశారంటే రవిచంద్రన్ అశ్విన్ ఉండి ఉంటే టీమిండియాకి చాలా ప్లస్ అయ్యేది. అదీకాక స్టీవ్ స్మిత్‌పై అశ్విన్‌కి ఉన్న రికార్డు, భారత జట్టుకి బోనస్ అయ్యేది..

510

అదీకాకుండా ఉన్న వనరులను కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు రోహిత్ శర్మ. ఓ వికెట్ పడిన తర్వాత అటాకింగ్ ఫీల్డింగ్‌తో కొత్తగా క్రీజులోకి వచ్చే బ్యాటర్‌పై ఒత్తిడి పెంచడంలో రోహిత్ శర్మ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఫలితంగా ఆస్ట్రేలియా, ప్రతీ వికెట్‌‌కీ ఎంతో కొంత భాగస్వామ్యం నమోదు చేస్తూ సాగింది..

610

భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ అవుటైన వెంటనే పూజారా, కోహ్లీ అవుటైన వెంటనే జడేజా, రహానే అవుటైన వెంటనే టెయిలెండర్లు వరుసగా అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టీమిండియా మిస్ చేసింది ఇదే..

710

మరీ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్‌లో అగ్రెషన్ నింపడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మొదటి రోజు మొదటి సెషన్‌లో ఫుల్లు ఎనర్జీతో కనిపించిన ప్లేయర్లు, రెండో సెషన్‌కి సగం ఢీలా పడిపోయారు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ భాగస్వామ్యంతో మూడో సెషన్‌కి పూర్తిగా విసిగిపోయారు...

810

ఓ భారీ భాగస్వామ్యం నిర్మిస్తున్నప్పుడు దాన్ని విడగొట్టేందుకు రోహిత్ శర్మ నుంచి సరైన ప్రయత్నాలు రాలేదు. వాళ్లే అవుతారులే.. అన్నట్టుగా బౌలర్లను కొనసాగిస్తూ పోయాడు. టీమిండియా ఓటమికి ప్రధాన కారణం స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ నిర్మించిన 285 పరుగుల భారీ భాగస్వామ్యమే...

910

రోహిత్ శర్మ ఇప్పటిదాకా విదేశాల్లో టెస్టులకు కెప్టెన్సీ చేసింది లేదు. ఆడిన టెస్టు మ్యాచులన్నీ స్వదేశంలోనే జరిగాయి. కనీసం బంగ్లాదేశ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా రోహిత్ ఆడలేదు. దీంతో విదేశాల్లో టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ పూర్తి విఫలమయ్యాడు..

1010
Virat Kohli and Rohit Sharma

నాలుగు గంటల్లో ముగిసిపోయే ఐపీఎల్ మ్యాచ్‌, టెస్టు మ్యాచ్ రెండూ ఒక్కటి కాదు. బ్యాటర్‌గా రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకి సెట్ అవుతాడేమో కానీ టెస్టు కెప్టెన్‌గా విదేశాల్లో విజయాలు అందుకునేందుకు కావాల్సిన అగ్రెషన్ అయితే హిట్ మ్యాన్‌లో కనబడడం లేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.. 

Read more Photos on
click me!

Recommended Stories