మరి ఆ ముగ్గురూ ఎందుకున్నట్టు..? ఇంగ్లాండ్ సీనియర్లపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ విమర్శలు

Published : Dec 27, 2021, 12:11 PM IST

The Ashes 2021-22: యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు చతికిలపడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇదే విషయమై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ కూడా ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాళ్లపై ధ్వజమెత్తాడు. 

PREV
110
మరి ఆ ముగ్గురూ ఎందుకున్నట్టు..? ఇంగ్లాండ్ సీనియర్లపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ విమర్శలు

సాధారణంగా ఒక జట్టు విఫలమైనప్పుడు ఆ దేశానికి చెందిన మాజీలు, సీనియర్ ఆటగాళ్లు సదరు ఆటగాళ్లకపై దుమ్మెత్తి పోస్తారు. కానీ ఇక్కడ ఆశ్యర్యకరంగా ఇతర దేశాల క్రికెటర్లు కూడా పర్యాటక జట్టు ఆటతీరుపై విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం. 

210

ప్రతిష్టాత్మక సిరీస్ లో వరుసగా రెండు టెస్టుల్లో ఓడి నిర్ణయాత్మక మూడో టెస్టులో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్  తీవ్ర విమర్శలు చేశాడు. 

310

ఇంగ్లాండ్ జట్టులో సీనియర్ ప్లేయర్లుగా ఉన్న కెప్టెన్ జో రూట్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్,  వికెట్ కీపర్ జోస్ బట్లర్ పై  ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆ ముగ్గురూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని, అలాంటప్పుడు వాళ్లు జట్టులోని జూనియర్లకు ఏ విధంగా మార్గదర్శకంగా నిలుస్తారని ప్రశ్నించాడు. 

410

బెన్ స్టోక్స్ గురించి పాంటింగ్ మాట్లాడుతూ..‘అతడు అల్ట్రా డిఫెన్సివ్ గా కనిపిస్తున్నాడు. శారీరకంగా దృఢంగా ఉన్న ఆటగాడిగా స్టోక్స్ వ్యవహరించడం లేదు.  ప్రత్యర్థి ఆటగాళ్లను బ్యాట్ తో గానీ, బంతితో గానీ భయపెట్టాలన్నప్పుడు మీరు శారీరకంగా దూకుడుగా కనపించాలి. కానీ ఎందుకో స్టోక్స్ లో అది లోపించింది. 

510

తమ దేశంలో మాదిరిగా సంప్రదాయక పద్ధతిలో క్రికెట్ ఆడతామంటే అన్ని చోట్లా కుదరదు. అలాంటప్పుడు మీరు విఫలమవుతారు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీరు మీ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకురాకుంటే వాళ్లు మిమ్మల్ని ఔట్ చేస్తారు.. 

610

మేము మా జట్టులో ప్రతి ఆటగాడికి ఇదే చెప్తాం.. మీ బౌలర్ బాగా బంతులు విసరుతుంటే మీరు బ్యాటర్ గా ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అతడు గతి తప్పిన బంతులను వేస్తాడని వేచి చూడకూడదు.  దూకుడుగా వ్యవహరించాలి.  

710

స్టోక్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఆడుతున్నాడు.  ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న అతడు పరుగులు చేయడం చాలా అవసరం.. అయితే తన ముందు వచ్చినవాళ్లెవరూ సరిగా పరుగులు చేయలేకపోయేసరికి అతడు కూడా ఫ్రస్టేట్ అవుతండొచ్చు...’ అని  పాంటింగ్  చెప్పాడు. 

810


ఇక రూట్ గురించి స్పందిస్తూ.. ‘మీ ముగ్గురు (రూట్, స్టోక్స్, బట్లర్) సీనియర్ ఆటగాళ్లు క్షమించరాని తప్పు చేస్తున్నారు.  సీనియర్లుగా ఉండి మీరే సరిగా ఆడకుంటే జూనియర్లు ఏం ఆడతారు..? 

910

మిమ్మల్ని చూసే వాళ్లు ప్రేరణ పొందుతారు. కానీ మీరు మాత్రం వరుసగా విఫలమవుతుంటే వాళ్లు మీ నుంచి ఏం నేర్చుకుంటారు.? మీరు అలా అవుతుంటే ఇక  జూనియర్లు ఎందుకు తప్పులు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు..’అని పాంటింగ్ ధ్వజమెత్తాడు. 

1010

బ్రిస్బేన్ తో పాటు అడిలైడ్ టెస్టులో తీవ్ర పరాభావం పొందిన ఇంగ్లాండ్ జట్టు మెల్బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టులో కూడా తొలి ఇన్నింగ్సులో 185 పరుగులకే చాప చుట్టేసిన విషయం తెలిసిందే.   

click me!

Recommended Stories