హనుమ విహారి... మోస్ట్ అండర్‌రేటెడ్ టెస్టు బ్యాట్స్‌మెన్. విదేశీ పిచ్‌లపై రాణించి, సత్తా చాటినప్పటికీ ఈ తెలుగు క్రికెటర్‌కి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. సెంచూరియన్ టెస్టులో విహారి ఆడతాడని అందరూ భావించినా, మరోసారి నిరాశ తప్పలేదు...
93 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 21 సెంచరీలతో 7,194 పరుగులు చేసిన హనుమ విహారి, 12 టెస్టుల్లో 36 సగటుతో 624 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో త్రిబుల్ సెంచరీ సాధించిన విహారి, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో టెస్టు సిరీస్‌లు ఆడాడు.
213
వెస్టిండీస్ పర్యటనలో 128 బంతుల్లో 93 పరుగులు చేసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారి, ఆ తర్వాతి మ్యాచ్‌లో 111 పరుగులు చేసి తొలి టెస్టు సెంచరీ అందుకున్నాడు...
313
ఆస్ట్రేలియా టూర్ ఆరంభానికి ముందు కూడా హనుమ విహారి ఆటతీరు అంటే తనకెంతో ఇష్టమని, అతనిలో అద్భుతమైన టాలెంట్ దాగి ఉందని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
413
ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టులో అశ్విన్‌తో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడి భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు హనుమ విహారి. అయితే ఆ తర్వాత విహారికి మరో ఛాన్స్ దక్కలేదు...
513
గాయం కారణంగా గబ్బా టెస్టు ఆడని హనుమ విహారిని, స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌కి ఎంపిక చేయలేదు. విదేశాల్లో ఘనమైన రికార్డు ఉన్న విహారిని, స్వదేశంలో సిరీస్‌కి ఎంపిక చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
613
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో హనుమ విహారికి చోటు దక్కింది...
713
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రిపరేషన్స్‌గా నెల ముందే ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీ మ్యాచులు ఆడాడు హనుమ విహారి. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కాదు కదా, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ విహారికి చోటు దక్కలేదు...
813
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే భారత్-ఏతో కలిసి అనధికారిక మూడు టెస్టుల సిరీస్ ఆడి, నిరూపించుకున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారికి చోటు ఇవ్వకపోవడంపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...
913
ఇప్పుడు సౌతాఫ్రికా టూర్ విషయంలో అంతే. సిరీస్ ఆరంభానికి నెల ముందే సఫారీ గడ్డపై మ్యాచులు ఆడేందుకు వచ్చాడు హనుమ విహారి. ఆఖరి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50+ స్కోర్లు చేసి ఆకట్టుకున్నాడు...
1013
కౌంటీ మ్యాచుల్లో పర్ఫామెన్స్ బాగోలేదని డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడించలేదని అనుకుంటే, సౌతాఫ్రికాలో ఫామ్ నిరూపించుకున్న విహారికి సెంచూరియన్ టెస్టులో చోటు దక్కాల్సింది. అయితే ఇప్పుడు కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు...
1113
టీమిండియా తీరు చూస్తుంటే, తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకి ముందు కూడా హనుమ విహారిని ముందుగానే అక్కడికి పంపిస్తారని... అయితే ఆడించే ఉద్దేశం మాత్రం భారత జట్టుకి లేదని ట్రోల్ చేస్తున్నారు...
1213
అత్యంత అరుదైన చైనామెన్ యాక్షన్‌తో బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్‌ని ఇలాగే టెస్టు సిరీస్‌లకు ఎంపిక చేస్తూ, తుదిజట్టులో చోటు కల్పించకుండా అతను తీవ్రమైన డిప్రెషన్‌కి లోనయ్యేందుకు కారణమైంది టీమిండియా మేనేజ్‌మెంట్...
1313
ఇప్పుడు హనుమ విహారి విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమోనని భయపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగల విహారిని సరిగ్గా వాడుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.