సింగిల్ హ్యాండ్‌తో సింపుల్‌గా సిక్సర్లు బాదిన రిషబ్ పంత్... అయ్య బాబోయ్ మనోడి ఫామ్ చూస్తుంటే...

First Published Mar 27, 2021, 10:21 AM IST

రిషబ్ పంత్... ఇప్పుడు బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. లాక్‌డౌన్ టైమ్‌లో ఏం చేశాడో లేక ఆస్ట్రేలియా టూర్‌లో ఏం తిన్నాడో కానీ గత మూడు నెలలుగా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ... ఓ కొత్త ఆటగాడిలా కనిపిస్తుననాడీ యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్...

మొదటి వన్డేలో లాగే రెండో వన్డేలో కూడా స్లోగా ఇన్నింగ్స్ ప్రారంభించింది టీమిండియా. 32 ఓవర్లలో కేవలం 158 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా, 50 ఓవర్లు ముగిసేసరికి 336 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందంటే అందుకు పంత్ మెరుపులు కూడా ఓ కారణం...
undefined
మొదట సింగిల్స్ తీస్తూ ఆడిన రిషబ్ పంత్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. ఆ తర్వాత తోప్లే బౌలింగ్‌లో బౌండరీ కొట్టాడు... టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అంపైర్ అవుట్ ఇవ్వడంతో రివ్యూ తీసుకున్న పంత్, నాటౌట్‌గా తేలాడు. అయితే అదే బంతికి పంత్ కొట్టిన ఫోర్ మాత్రం లెక్కలోకి రాలేదు.
undefined
ఆ తర్వాత బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు... మరోసారి టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌కి అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే మరోసారి డీఆర్‌ఎస్ తీసుకున్న పంత్, నాటౌట్‌గా తేలాడు. టీవీ రిప్లైలో బంతి, పంత్ మోచేతికి తగిలి, హెల్మెట్‌కి తగిలినట్టు స్పష్టంగా కనిపించింది...
undefined
అంపైర్ అవుట్‌గా ప్రకటించిన తర్వాతి రెండు బంతులకు అదిరిపోయే సిక్సర్ బాదాడు రిషబ్ పంత్... టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో రెండుసార్లు అంపైర్ నిర్ణయాల వల్ల అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పంత్, అతని బౌలింగ్‌లో ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
undefined
సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ కొట్టిన ఒంటి చేతి సిక్స్... భారత ఇన్నింగ్స్‌లో హైలైట్... ఆ తర్వాత అతని సోదరుడు టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో కూడా ఇలాంటి సిక్సర్ బాదాడు పంత్...
undefined
మొత్తంగా 40 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేసిన రిషబ్ పంత్, టీమిండియా ఫ్యాన్స్‌ను అదిరిపోయే ఇన్నింగ్స్ రుచి చూపించాడు.. రెండు చేతులతో సిక్సర్ బాదడమే కష్టమనుకుంటే, సింగిల్ హ్యాండ్‌తో సింపుల్‌గా సిక్సర్ బాది ‘ఔరా’ అనిపించాడు రిషబ్ పంత్..
undefined
click me!