RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!

Published : Jun 25, 2026, 10:08 PM IST

హైదరాబాద్ లో జరుగుతున్న టిజి20 లీగ్ లో లోకల్ టీం అదరగొట్టింది. రంగారెడ్డి రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ కెప్టెన్ అభిరత్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగి ఘన విజయాన్ని అందించాడు. 

PREV
14
టీజి20 లీగ్ లో సూపర్ మ్యాచ్

TG20 League : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 లీగ్ (TG20) లీగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. లోకల్ టాలెంట్ ను గుర్తించేందుకు HCA ఈ టోర్నీ చేపట్టింది... కానీ అంతర్జాతీయ మ్యాచ్ లకు ఏమాత్రం తీసిపోనట్లుగా మ్యాచ్ లు ఉంటున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత మొదలైన ఈ లీగ్ అదే స్థాయిలో క్రికెట్ ప్రియులను ఎంటర్టైన్ చేస్తోంది. బ్యాటర్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నారు... బౌలర్లు వికెట్ల మీద వికెట్లు తీస్తున్నారు... ఇలా టిజి20 లీగ్ అంతకంతకు మరింత ఆసక్తికరంగా మారుతోంది.

24
రంగారెడ్డిపై హైదరాబాద్ విజయం...

టిజి20 లీగ్ లో భాగంగా ఇవాళ (జూన్ 25, గురువారం) ఉప్పల్ స్టేడియంలో రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు విజయం హైదరాబాద్ నే వరించింది. హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ కెప్టెన్ అభిరత్ రెడ్డి బ్యాటింగ్ భారాన్ని తన భుజానేసుకుని హైదరాబాద్ కు అద్భుత విజయాన్ని అందించాడు. కేవలం 45 బంతుల్లో 99 పరుగులు చేసిన రెడ్డి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అతడు 6 సిక్సులు, 10 ఫోర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే (18 ఓవర్లలో) రంగారెడ్డిపై హైదరాబాద్ విజయం సాధించింది. ఒంటిచేత్తో టీంను గెలిపించిన కెప్టెన్ అభిరత్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

34
హైదరాబాద్ ఇన్నింగ్స్ సాగిందిలా..

మొదట బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది... ఓపెనర్ వికాస్ రెడ్డి 3, మరో బ్యాటర్ అన్విత్ రెడ్డి 4 పరుగులకే ఔటయ్యారు. ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిరత్ రెడ్డి ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాడు... అతడికి షణ్ముఖ అశ్విన్ (30 పరుగులు) నుండి చక్కని సహకారం అందింది. ఆ తర్వాత గడుగు గణేష్ 25 పరుగులు, యశ్విర్ గౌడ్ 30 పరుగులతో చెలరేగి హైదరాబాద్ ను విజయతీరానికి చేర్చారు.

వేగంగా పరుగులు సాధించే క్రమంలో కెప్టెన్ అభిరత్ రెడ్డి సెంచరీ మిస్సయ్యాడు... 99 పరుగుల వద్ద త్యాగరాజన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. వ్యక్తిగతంగా సెంచరీ చేయలేకపోయినా తన జట్టుకు విజయాన్ని అందించాడు.. ''మన రెడ్డిగారు ఏం ఆడారు భయ్యా'' అని హైదరాబాద్ అభిమానులతో అనిపించుకున్నాడు అభిరత్.

44
రంగారెడ్డి రైజర్స్ కు తప్పని ఓటమి

రంగారెడ్డి రైజర్స్ బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు.. ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించారు. ఆరోన్ జార్జ్ 35 పరుగులతో పరవాలేదనిపించాడు... మరో ఓపెనర్ ఆరవెల్లి అవనీష్ 53 పరుగులు (29 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆదిత్య జవ్వాజి కూడా హాఫ్ సెంచరీ (58 పరుగులు) చేశాడు. కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ 31 పరుగులు చేశాడు. ఇలా బ్యాటర్లందరు రాణించడంతో రంగారెడ్డి రైజర్స్ 195 పరుగుల భారీ స్కోరు చేసింది.

అయితే ఈ భారీ పరుగులను కాపాడుకోవడంలో రంగారెడ్డి బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ కెప్టెన్ అభిరత్ రెడ్డిని అడ్డుకోలేకపోయారు… వీరిని చితక్కొడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇతడే రంగారెడ్డి రైజర్స్ చేతిలోంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories