Tilak Varma: తిలక్ వర్మ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. 22 బంతుల్లోనే తెలుగోడి మాస్ విధ్వంసం

Published : Oct 03, 2026, 02:25 PM IST

Tilak Varma: తెలుగు యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా అంటూ పారిపోయింది. ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో తిలక్ వర్మ కేవలం 22 బంతుల్లో 51* రన్స్ కొట్టి పాకిస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చాడు.

PREV
16
పాక్ బౌలర్లకు నరకం చూపించిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ రికార్డులు ఖతమ్!

ఆపియా గేమ్స్ 2026 పురుషుల టీ20 క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ లో జరిగిన హైవోల్టేజ్ ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ చిరస్మరణీయ విజయంలో తెలుగు ప్లేయర్, హైదరాబాదీ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఆడిన మాస్ ఇన్నింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇన్నింగ్స్ ముగింపులో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ పాక్ బౌలర్లను ఊచకోత కోశాడు. టీమిండియా స్కోరు 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.

26
అభిషేక్ ధమాకా.. ఆపై తిలక్ వర్మ రచ్చ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ 15 రన్స్ చేసి అవుటైనప్పటికీ, అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పాకిస్థాన్ పై టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. అతడు 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులు చేసి అవుటయ్యాడు. పవర్‌ప్లేలో భారత్ 81/2 స్కోరు సాధించింది. అయితే, అభిషేక్ అవుటయ్యాక స్పిన్నర్ల ధాటికి శ్రేయస్ అయ్యర్ (21), ఇషాన్ కిషన్ (20) పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. 13.1 ఓవర్లలో భారత్ 128/4తో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. తన మాస్ పవర్ చూపించాడు.

36
22 బంతుల్లోనే 51 నాటౌట్.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన తిలక్

క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే తిలక్ వర్మ మాస్ మోడ్ ఆన్ చేశాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన తిలక్, ఓవరాల్‌గా 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ ఏకంగా 231.82గా నమోదైంది. శివమ్ దూబే (15 బంతుల్లో 27 నాటౌట్) తో కలిసి తిలక్ వర్మ 6th వికెట్‌కు కేవలం 30 బంతుల్లోనే 62 పరుగుల నాటౌట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బౌలర్లలో అరాఫాత్ మిన్హాస్ 2/25, అహ్మద్ దానియాల్ 2/43 వికెట్లు తీశారు.

46
పాకిస్థాన్ పై తిలక్ వర్మ డ్రీమ్ రికార్డ్

పాకిస్థాన్ పై తిలక్ వర్మ రికార్డు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. టీ20 ఫార్మాట్‌లో పాక్ పై తిలక్ వర్మకు ఇది రెండో అర్ధ సెంచరీ. ఇప్పటివరకు పాక్‌పై ఆడిన 5 టీ20 ఇన్నింగ్స్‌‌లలో తిలక్ ఏకంగా 103.00 సగటుతో, 138.25 స్ట్రైక్ రేట్‌తో 206 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫిఫ్టీలు, 12 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. గతంలో విరాట్ కోహ్లీ పాక్ పై సాధించిన ఆధిక్యం తరహాలోనే, ప్రస్తుతం తిలక్ వర్మ కూడా పాక్ జట్టుకు సింహస్వప్నంగా మారాడు.

56
టీ20 కెరీర్‌లో మరిన్ని ఘనతలు

ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 65 మ్యాచ్‌‌లలో (1,719 పరుగులు, 145.06 స్ట్రైక్ రేట్, 44.07 సగటు) 10వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్ టీ20 ఫార్మాట్‌లో తిలక్ వర్మ 173 మ్యాచ్‌లలో 41.21 సగటుతో 4,987 పరుగులు చేశాడు. అతడు 5,000 పరుగుల మైలురాయికి కేవలం 13 పరుగుల దూరంలో ఉన్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 30 అర్ధ సెంచరీలు, 5 సెంచరీలు, 242 సిక్సర్లు బాదాడు.

66
ఛేజింగ్‌లో పాక్ విఫలం.. భారత్‌కు గోల్డ్

212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. పాక్ కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాత్ (10), ఉస్మాన్ ఖాన్ (3) త్వరగానే అవుట్ అయ్యారు. అయితే, హసన్ నవాజ్ 51 బంతుల్లో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా, పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసియా గేమ్స్ 2026లో క్రికెట్ గోల్డ్ మేడల్‌ను తన సొంతం చేసుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories