నట్టూకి అదిరిపోయే వెల్‌కమ్ చెప్పిన గ్రామస్థులు... రథంపై ఊరేగిస్తూ... ఇండియా అంటే ఇదే...

First Published Jan 22, 2021, 9:47 AM IST

ఐపీఎల్ 2020 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్‌కి బాగా కలిసొచ్చింది. ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులు యార్కర్లు వేసి అదరగొట్టిన నటరాజన్, అతి తక్కువ సమయంలో వన్డే, టీ20, టెస్టుల్లో ఆరంగ్రేటం ఇచ్చేశాడు.

టీ20లకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన నట్టూ... సైనీ పర్ఫామెన్స్ కారణంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు.
undefined
మొదటి వన్డే, ఆ తర్వాత టీ20 సిరీస్, ఆ తర్వాత టెస్టు మ్యాచ్... ఇలా ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్లలో నట్టూ ఒకడు...
undefined
ఐపీఎల్ కోసం యూఈఏ, అటు నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన తింగరసు నటరాజన్... ఐదు నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాడు. నట్టూకి చిరకాలం గుర్తుండిపోయే రేంజ్‌లో స్వాగతం లభించింది.
undefined
తమిళనాడులోని మారుమూల ప్రాంతమైన చిన్నప్పంపట్టికి చెందిన నటరాజన్ కోసం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథం సిద్ధం చేసిన అభిమానుల, డప్పు సందళ్లతో ఊరేగింపుగా అతన్ని ఇంటికి తీసుకెళ్లారు.
undefined
నట్టూకి చూసేందుకు, పూల మాలలు వేసేందుకు జనాలు ఎగబడ్డారు... అశేషంగా తరలి వచ్చిన అభిమానులకు నమస్కరిస్తూ, సగర్వంగా జాతీయ జెండాను పట్టుకున్నాడు నటరాజన్.
undefined
ఈ వీడియోను పోస్టు చేసిన భారత మాజీ ఓపెనర్, వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్... ‘స్వాగతం ఇవ్వరా... ఇది ఇండియా. ఇక్కడ క్రికెట్ కేవలం ఓ ఆట మాత్రమే కాదు. అంతకుమించి...
undefined
నటరాజన్‌కి సాలెం జిల్లాలోని చిన్నప్పంపట్టి గ్రామంలో ఘనమైన స్వాగతం లభించింది...వాట్ ఏ స్టోరీ...’ అంటూ కామెంట్ చేశారు.
undefined
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ జట్టులోని సభ్యులందరికీ స్వదేశంలో అద్భుతమైన స్వాగతం లభించింది. అజింకా రహానే, హనుమ విహారి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్... ఇలా ప్రతీ ఒక్క ప్లేయర్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
undefined
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ నెగ్గిన అజింకా రహానేకు స్వాగతం చెబుతూ... కంగారూ ఆకారంలో కేక్ సిద్ధం చేశారు ఆయన నివసించే సోసైటీ సభ్యులు. అయితే ఆ కేక్ కత్తిరించేందుకు రహానే నిరాకరించాడు...
undefined
ముంబైలోని రహానే ఇంటి దగ్గర ‘కెప్టెన్ రహానే’ అంటూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్... హాట్ టాపిక్ అయ్యాయి.
undefined
click me!