ICC WTC Final: ఐదో రోజు తొలి సెషన్ మనదే... ఆకట్టుకున్న మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ...

First Published Jun 22, 2021, 6:21 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎట్టకేలకు భారత బౌలర్లు ఫామ్‌లోకి వచ్చారు. ఐదో రోజు వర్షం కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన ఆట మొదటి సెషన్‌లో భారత్ ఆధిక్యం చూపించింది...

మూడో రోజు ఆట ముగిసే సమయానికి 1012 స్కోరు వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్... చాలా జాగ్రత్తగా భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు... దాదాపు 14 ఓవర్ల తర్వాత భారత జట్టుకి తొలి వికెట్ దక్కింది...
undefined
37 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రాస్ టేలర్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... టేలర్ కొట్టిన షాట్‌ను అద్భుతంగా క్యాచ్‌గా మలిచాడు శుబ్‌మన్ గిల్...
undefined
ఆ తర్వాత వస్తూనే బౌండరీ బాదిన హెన్రీ నికోలస్ 23 బంతుల్లో 7 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
undefined
3 బంతుల్లో ఒక్క పరుగు చేసిన బీజే వాట్లింగ్‌ను మహ్మద్ షమీ, క్లీన్ బౌల్డ్ చేశారు... 1172 వద్ద న్యూజిలాండ్, 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది...
undefined
అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ మాత్రం భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిస్తున్నాడు...
undefined
112 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌కి తోడుగా కోలిన్ ది గ్రాండ్‌హోమ్ క్రీజులో ఉన్నాడు. ఐదో రోజు తొలి సెషన్‌లో 34 పరుగులు జోడించిన న్యూజిలాండ్, మూడు వికెట్లు కోల్పోయింది.
undefined
click me!