పూజారా, కోహ్లీ, పంత్, రహానే, రోహిత్... ఒక్కొక్కరూ ఒక్కో రకం... - భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్

First Published Jun 5, 2021, 4:27 PM IST

భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, భారత జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ఒక్కొక్కరూ ఒక్కో రకం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విక్రమ్ రాథోడ్...

‘భారత జట్టును ఎప్పటికప్పుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చర్చలు జరుగుతూనే ఉంటాయి. భారత జట్టు ఇప్పుడున్న స్థితికి అవే ప్రధాన కారణం. భారత జట్టులో పూర్తిగా భిన్నమైన ప్లేయర్లు ఉన్నారు.
undefined
పూజారా, రిషబ్ పంత్ ఇద్దరూ రెండు భిన్న వ్యక్తిత్వాలు కలిగినవాళ్లు. ఇద్దరూ భారత జట్టుకి ఎంతో అవసరం. అందుకే ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారి గురించి తెలుసుకుంటూ ఉంటా...
undefined
విఫలమైన ప్రతీ క్రికెటర్, తాను మెరుగవ్వడానికి, మరింత మెరుగ్గా రాణించడానికి పరిష్కారాలు కోరుకుంటూనే ఉంటారు. బ్యాటింగ్ కోచ్‌గా వారి సమస్యను తెలుసుకుని, దానికి పరిష్కారాన్ని చూపించడం కూడా నా బాధ్యతే.
undefined
భారత జట్టులో చాలా టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఛతేశ్వర్ పూజారా చాలా మెచ్యూర్డ్. అంకితభావం చాలా ఎక్కువ. గబ్బాలో ఎలా ఆడాడో మీరే చూశాడు. అతనికి మొండి పట్టుదల చాలా ఎక్కువ.
undefined
ఆటలో క్రమశిక్షణతో మెలిగే ఛతేశ్వర్ పూజారా, తన జీవితంలోనూ ఈ రూల్‌ను అతిక్రమించడు. పూజారాతో పోలిస్తే రిషబ్ పంత్ చాలా ఫన్నీ పర్సన్. అందరితో సరదాగా ఉంటూ, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే తాపత్రయపడుతుంటాడు.
undefined
పూజారా ఎన్నో షాట్లు ఆడగలడు, కానీ సిక్సర్లు కొట్టడానికి అస్సలు ఇష్టపడడు. రిషబ్ పంత్ అవకాశం దొరికితే సిక్సర్లు బాదడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఇప్పుడు రిషబ్ పంత్‌కి డిఫెన్స్ నేర్పిస్తూ, పూజారాకి షాట్లు ఆడడం నేర్పించడమే నా పని...
undefined
అయితే అలా ప్రయత్నిస్తే వారి సహజ శైలి దెబ్బతిని, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారి స్టైల్‌లో వారిని ఆడనిస్తూ, లోపాలను సరిదిద్దుకునేలా చేస్తా. విరాట్ కోహ్లీ టీమ్‌లో చాలా స్పెషల్.
undefined
కెప్టెన్ అయినా అతనిలో ఆ భావం ఎప్పుడూ కనిపించడదు. కొందరు ప్లేయర్లు ఒత్తిడిలో బాగా ఆడతారు, మరికొందరు డిఫెన్స్, ఇంకొందరు అయితే కేవలం భారీ షాట్లు మాత్రమే ఆడగలరు. కోహ్లీలో ఇవన్నీ ఉన్నాయి.
undefined
నా దృష్టిలో విరాట్ కోహ్లీ ఓ పరిపూర్ణమైన క్రికెటర్. అతను ఉంటే జట్టుకి అదే పెద్ద అడ్వాంటేజ్. మ్యాచ్ పరిస్థితులను బట్టి డిఫెన్స్ ఆడగలడు. అవసరమైనప్పుడు ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను ముగించగలడు...
undefined
రోహిత్ శర్మ ఇప్పుడిప్పుడే టెస్టుల్లో రాణించడానికి అవసరమైన టెక్నిక్ నేర్చుకుంటున్నాడు. భవిష్యత్తులో అతను టెస్టుల్లోనూ స్టార్ బ్యాట్స్‌మెన్‌ అవుతాడు...
undefined
విరాట్ కోహ్లీ లాగే టెస్టుల్లో అజింకా రహానే జట్టు అవసరాలకు తగ్గట్టుగా తనని తాను మార్చుకోగల గొప్ప ప్లేయర్..’ అంటూ చెప్పుకొచ్చాడు విక్రమ్ రాథోడ్.
undefined
click me!