అమ్మాయిలు ఇరగదీశారు... ఏడేళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో అద్భుత పోరాటం...

Published : Jun 19, 2021, 11:28 PM IST

ఏడేళ్ల తర్వాత ఆడుతున్న తొలి టెస్టు మ్యాచ్. జట్టులో ఏకంగా 8 మందికి ఇదే తొలి టెస్టు. అయితేనేం భారత మహిళా జట్టు అద్భుతం చేసింది. అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను డ్రాగా ముగిసింది. ఒకనాక దశలో ఇంగ్లాండ్ తేలికగా విజయం సాధిస్తుందని అనిపించినా, భారత టెయిలెండర్లు పోరాటంతో నాలుగు రోజుల పాటు సాగిన మ్యాచ్‌లో ఫలితం తేలలేదు...

PREV
19
అమ్మాయిలు ఇరగదీశారు... ఏడేళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో అద్భుత పోరాటం...

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 396/9 పరుగుల భారీ స్కోరు చేసి, డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు స్నేహ్ రాణాకి 4, దీప్తి శర్మకు 3 వికెట్లు దక్కాయి...

29

ఇంగ్లాండ్ కెప్టెన్ నైట్ 95, సోఫియా డంక్లీ 74, బీమోంట్ 66 పరుగులు చేశాయి. భారత యంగ్ గన్ షెఫాలీ వర్మ 96 పరుగుల సంచలన ఇన్నింగ్స్, స్మృతి మంధాన 78 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌కి 167 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించింది.

39

అయితే షెఫాలీ వర్మ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది టీమిండియా. సీనియర్లు మిథాలీ రాజ్ 2, హర్మన్‌ప్రీత్ కౌర్ 4, పూనమ్ రౌత్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 61 పరుగుల తేడాతో 10 వికెట్లు కోల్పోయి 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది భారత జట్టు.

49

దీంతో ఇంగ్లాండ్, భారత జట్టును ఫాలోఆన్ ఆడించింది. స్మృతి మంధాన 8 పరుగులే అవుట్ అయ్యింది. ఆ తర్వాత షెఫాలీ వర్మ 83 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేసి, అదరగొట్టింది. టీమిండియా తరుపున ఎంట్రీ ఇస్తూ రెండు ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన తొలి మహిళ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది షెఫాలీ వర్మ...

59

99 పరుగుల వద్ద షెఫాలీ వర్మ అవుట్ కావడం, అప్పటికి ఇంకా ఇంగ్లాండ్ స్కోరుకి బాగా వెనకబడి ఉండడంతో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఖాయమనుకున్నారంతా. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన దీప్తి శర్మ 54 పరుగులు, పూనమ్ రౌత్ 39 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

69

ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే ఆ తర్వాత మిథాలీరాజ్ 4, హర్మన్‌ప్రీత్ 8, పూజా వస్తాకర్ 12 పరుగుల రూపంలో వరుస వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

79

199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో స్నేహ్ రాణా, అద్భుత పోరాటంతో భారత జట్టును గట్టెక్కించింది. 18 పరుగులు చేసిన శిఖా పాండేతో కలిసి 8వ వికెట్‌కి 41 పరుగులు జోడించిన స్నేహ్ రాణా, 9వ వికెట్‌కి వికెట్ కీపర్ తానియా భాటియాతో కలిసి అజేయంగా 104 పరుగులు జోడించింది.

89

తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన స్నేహ్ రాణా, 154 బంతుల్లో 13 ఫోర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, తానియా భాటియా 88 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసింది. 

99

సీనియర్లు ఫెయిల్ అయినా తొలి మ్యాచ్ ఆడుతున్న షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా అద్భుతంగా రాణించి, భారత జట్టుకి చారిత్రక డ్రా అందించారు... ఇంకో రోజు ఉండి ఉంటే ఫలితం టీమిండియా వైపే వచ్చి ఉండేది. 

click me!

Recommended Stories