టీమిండియా చీఫ్ కోచ్ పదవికి 200 దరఖాస్తులు...కానీ పోటీ మాత్రం వీరి మధ్యే

First Published Aug 1, 2019, 4:43 PM IST

టీమిండియా కోచింగ్ సిబ్బందిని ఎంపిక చేసేందుకు ఇప్పటికే బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఒక్క చీఫ్ కోచ్ పదవికోసమే దాదాపు 200 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇందులో కొంతమందే ప్రధాన పోటీలో నిలవనున్నారు. వారెవరో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.  

టీమిండియా కోసం నూతన కోచింగ్ సిబ్బందిని నియమించడానికి బిసిసిఐ ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే బిసిసిఐ ప్రకటనకు భారీ స్పందన వచ్చింది. కేవలం ఒక్క చీఫ్ కోచ్ పదవికోసమే దాదాపు 200 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. జూలై 30తో దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో ఎంపిక ప్రక్రియను చేపడుతున్న సీఏసి బృందం ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలా ఈ 200మందిని ఇంటర్వ్యూ చేసిన పిమ్మట టీమిండియా చీఫ్ కోచ్ గా ఒక్కరిని మాత్రమే ఫైనల్ చేయనున్నారు.
undefined
ఇలా భారీ సంఖ్యలో దేశ, విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నా ప్రధాన ఫోటీలో కొందమంది మాత్రమే నిలవనున్నారు. అలాంటి వారిలో ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి ముందు వరుసలో వున్నాడు. మళ్లీ భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు అతడికే ఎక్కువగా వున్నట్లు కనిపిస్తోంది.
undefined
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరికొంత మంది కీలక ఆటగాళ్లతో శాస్త్రికి మంచి సత్సంబంధాలున్నాయి. అంతేకాకుండా బిసిసిఐ సీనియర్ అధికారుల్లో కూడా అతడిపై మంచి అభిప్రాయమే వుంది. కాబట్టి ప్రస్తుతం చీఫ్ కోచ్ గా పనిచేస్తున్న అతడు దరఖాస్తు చేయకున్నా అతడినే కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
undefined
రవిశాస్త్రికి గట్టి ఫోటీ ఇచ్చే వారిలో ఆస్ట్రేలియా మాజీ ఆలౌ రౌండర్ టామ్ మూడీ ముందున్నాడు. గతంలో కూడా ఈయన ఈ పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే ప్రస్తుతం ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ గా అతడు ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు లేని జట్టును కూడా ప్రధాన ఫోటీలో నిలబెడుతూ కోచ్ గా మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో మరోసారి టీమిండియా కోచ్ రేసులో ప్రదాన ఫోటీదారుగా నిలిచాడు.
undefined
మరోవైపు టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా మరోసారి ఈ పదవిని చేపట్టాలని భావిస్తున్నాడు. అతడి హయాంలోనే ధోనిసేన 2011 లో రెండోసారి ఐసిసి వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకుంది. కాబట్టి కోహ్లీసేనను కూడా 2023 ప్రపంచ కప్ లక్ష్యంగా తీర్చిదిద్దాలని అనుకుంటే ఇతన్ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
undefined
న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్ కూడా టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రధానంగా నిలిచాడు. అతడు కోచ్ గా పనిచేస్తున్న కాలంలోనే కివీస్ జట్టు 2015 ప్రపంచ కప్ ఫైనల్ వరకు చేరింది. ఇలా న్యూజిలాండ్ కోచ్ మంచి ఫలితాలను రాబట్టిన మైక్ భారత కోచ్ బాధ్యతలు స్వీకరించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
undefined
ఇక భారత మాజీ ఆటగాళ్ల విషయానికి వస్తే చాలామంది పేర్లే వినిపించాయి. కానీ చివరకు రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్ పుత్ లు మాత్రమే ఫోటీలో నిలిచారు. అండర్ 19, భారత్ ఎ జట్లకు కోచ్ గా పనిచేసిన అనభవమున్న రాబిన్ సింగ్ 2007 లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా కూడా వ్యవహరించాడు. కాబట్టి స్వదేశీ ఆటగాన్నే మళ్లీ కోచ్ గా నియమించాలనుకుంటే ఇతడే రవిశాస్త్రికి గట్టి ఫోటీ ఇవ్వనున్నాడు.
undefined
ఇక లాల్ చంద్ రాజ్ పుత్ ప్రస్తుతం జింబాబ్వే కోచ్ గా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు అప్ఘానిస్తాన్ కోచ్ గా కూడా పనిచేసిన అనుభవముంది. జింబాబ్వే జట్టు సస్పెన్షన్ కు గురవడంతో ఇతడు చివరి నిమిషంలో చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. చీఫ్ కోచ్ గా కాకున్నా బ్యాటింగ్ కోచ్ గా అయినా నియమించాలని అతడు కోరుతున్నాడు.
undefined
ఇక టీమిండియా చీఫ్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్ టీం కోచ్ మహేల జయవర్ధనేది. ఒకవేళ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ అవకాశమివ్వాలని భావిస్తే మాత్రం ఇతన్ని చీఫ్ కోచ్ గా ఎంపిక చేయడం మంచిదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున వీరిద్దరు కలిసి మంచి ఫలితాలు సాధించడమే ఇందుకు కారణం.
undefined
click me!