ధోని స్థానంలో ఆడుతున్నా....కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకోవాల్సిందే: రిషబ్ పంత్

First Published Jul 26, 2019, 5:09 PM IST

మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా లెజెండరీ  ప్లేయర్. అయితే అతడు ఇటీవల విండీస్ పర్యటనుకు దూరమవడంతో ఈ స్థానంలో రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ధోని  స్థానంలో ఆడే అవకాశం రావడంపై పంత్ స్పందించాడు.  

మహేంద్ర సింగ్ ధోని వెస్టిండిస్ పర్యటనకు అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో యువ క్రికెటర్ రిషబ్ పంత్ దక్కించుకున్నాడు. అయితే ఇలా ధోని వంటి లెజెండరి క్రికెటర్ స్ధానాన్ని భర్తీ చేసే అవకాశం రావడం అతడి అదృష్టమే. అయితే ఆ అదృష్టమే అతడికి పెద్ద సవాల్ గా మారనుంది. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్(ముఖ్యంగా సూపర్ ఫినిషర్) మంచి రికార్డున్న ధోని స్థానంలో వచ్చిన ఆటగాడు అదే స్థాయిలో ఆడాలని అభిమానులు కోరుకుంటారు. ఆ విషయంలో ఏమాత్రం అటుఇటయినా పంత్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుంది. అతడి కెరీరే ప్రమాదంలో పడే అవకాశం వుంది.
undefined
రిషబ్ పంత్ ఐపిఎల్, ఇటీవల జరిగిన ప్రపంచ కప్ లో బ్యాట్స్ మెన్ అదరగొట్టాడు. అయితే వికెట్ కీపింగ్ లోనే అతడిలో కొద్దిగా తడబాటు కనిపిస్తుంటుంది. ఆ విషయంలో అతడు మెరుగుపడితే ధోని స్థానంలో స్థిరపడే అవకాశాలు అతడికే మెండుగా వుంటాయి. కేవలం వెస్టిండిస్ టూర్ కే కాకుండా ధోని రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానంలో పంత్ స్థిరపడిపోవచ్చు. ఇలా జరగాలంటే వెస్టిండిస్ పర్యటన ద్వారా వచ్చిన అరుదైన అవకాశాన్ని పంత్ సద్వినియోగం చేసుకోవాల్సి వుంటుంది.
undefined
ఇప్పటికే పంత్ ధోని వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే దీన్ని అలాగే నిలబెట్టుకోవాలంటే పంత్ తదుపరి మ్యాచుల్లో కూడా అదే స్థాయిలో రాణించాల్సి వుంటుంది. లేదంటే సీనియర్ల దినేశ్ కార్తిక్, వృద్దిమాన్ సాహా, తెలుగు యువ కెరటం శ్రీకర్ భరత్ నుండి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వుంటుంది. వీరిలో భారత ఎ జట్టు వికెట్ కీపర్ భరత్ పేరును విండీస్ టూర్ కు పరిశీలించినట్లు స్వయంగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాటలను పంత్ గుర్తుపెట్టుకుంటే మంచిది.
undefined
ప్రస్తుతం ధోని టీమిండియా జట్టుకు దూరంగా వుండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే అతడు వెస్టిండిస్ పర్యటనకు సైతం దూరంగా వుంటూ ఆర్మీ విధులు చేపట్టేందుకు సిద్దపడ్డాడు. ఒకవేళ పంత్ తో పాటు మిగతా ఆటగాళ్లు అతడి స్థానాన్ని భర్తీచేయలేని పరిస్థితే ఉత్పన్నమయితే మళ్లీ జట్టులో చేరడానికి మాత్రం అతడు సిద్దంగా వుంటాడు. అందువల్లే రిటైర్మెంట్ ను ధోని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
undefined
ధోని స్థానంలో విండీస్ పర్యటనకు ఎంపికవడం ఓవైపు ఆనందాన్నిస్తున్నా మరో వైపు ఆందోళనగా కలిగిస్తోందని పంత్ తెలిపాడు. ధోని స్థానంలో ఆడటం అంత సులువు కాదు. కానీ ఆ స్థాయిని అందుకోడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పంత్ తెలిపాడు. అందుకోసం ఒళ్లు దగ్గరపెట్టుకొని జాగ్రత్తగా ఆడతానని తెలిపాడు. ఆ పర్యటన నాకో చాలెంజ్ గా మారనుందని తెలుసని...అయితే ఆ ఛాలెంగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి సిద్దంగా వున్నట్లు రిషబ్ పంత్ స్పష్టం చేశాడు.
undefined
click me!