టీమిండియా చీఫ్ కోచ్ రేసులో ఉన్నది వీరే...

First Published Jul 23, 2019, 2:46 PM IST

టీమిండియా చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో అతడి స్థానంలో  నూతన కోచ్ ను నియమించేందుకు బిసిసిఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ పదవిని చేపట్టేందుకు భారత మాజీ ఆటగాళ్లే కాకుండా  విదేశీ ఆటగాళ్లు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ రేసులో ఎవరెవరు వున్నారో తెలుసుకుందాం.  

ఇంగ్లాండ్ వేదికన ప్రపంచ కప్ మెగా టోర్నీ ముగిసింది. అయితే ఈ టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడినా దురదృష్టం వెంటాడటంతో సెమీస్ నుండే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 2023 ప్రపంచ కప్ టోర్నమెంటే లక్ష్యంగా భారత జట్టులో సమూల మార్పులకు బిసిసిఐ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ముందుగా కోచింగ్ సిబ్బంది మార్చాలని బిసిసిఐ భావిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రితో పాటు మిగతా కోచింగ్ సిబ్బంది పదవీకాలం ఇప్పటికే ముగిసింది. దీంతో టీమిండియాకు కొత్త కోచ్ ను నియమించే ప్రక్రియను బిసిసిఐ ఇప్పటికే ప్రారంభించింది.
undefined
టీమిండియా కోచ్ పదవికి బిసిసిఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో పాటు టీమిండియాకు చెందిన మాజీ ఆటగాళ్లు, ఇతర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా ఈ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా వీరంతా చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకకోడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది.
undefined
ఇప్పటివరకు టీమిండియా చీఫ్ కోచ్ గా వ్యవహరించిన రవిశాస్త్రికి ఆటగాళ్లతో మరీ ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీతో మంచి సత్సంబంధాలున్నాయి. అంతేకాకుండా బిసిసిఐ అధికారులతో కూడా అతడు సన్నిహితంగా వుంటాడు. అతడి కోచ్ గా వ్యవహరించిన సమయంలోనే ప్రపంచ కప్ మిస్సయినా అంతకు ముందు జరిగిన విదేశీ సీరిస్ లతో పాటు స్వదేశీ సీరీసుల్లో అద్భుతంగా రాణించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మరోసారి తనకే టీమిండియా కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని రవిశాస్త్రి బిసిసిఐ ని కోరనున్నట్లు సమాచారం. కోరడం అంటే చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనున్నాడన్న మాట.
undefined
ఇక రవిశాస్త్రి తర్వాత టీమిండియా ఛీప్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అతడు కూడా భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలను స్వీకరించడానికి సుముఖంగా వున్నాడు. బిసిసిఐ కూడా ఇతడిపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల సెహ్వాగ్ టీమిండియా చీఫ్ కోచ్ గా నియామకమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
undefined
ప్రస్తుతం భారత-ఎ జట్టు కోచ్ గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. యువ జట్టు కోచ్ ఆటగాళ్లను సానబడుతూ వారిలోకి అత్యుత్తమ ఆటగాళ్లను వెలికితీస్తున్నాడు. ఇలా చాలా మంది ఆటగాళ్లు ద్రవిడ్ శిక్షణలో రాటుదేలి అంతర్జాతీయ స్ధాయి ఆటగాళ్లుగా ఎదుగుతున్నారు. దీంతో బిసిసిఐ ద్రవిడ్ పై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు కూడా చీఫ్ కోచ్ పదవికి పోటీపడే అవకాశాలున్నాయి.
undefined
శ్రీలంక మాజీ సారథి, ప్రస్తుతం ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే కూడా టీమిండియా చీఫ్ కోచ్ పదవికి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో అతడు మంచి సంత్సంబంధాలు కలిగివుండటం... ఆ జట్టును రెండుసార్లు టోర్నీ విజేతగా నిలపడం అతడికి కలిసివచ్చే అంశాలు. 2023 ప్రపంచ కప్ నాటికి రోహిత్ శర్మకు వన్డే జట్టు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్న నేపథ్యంలో జయవర్థనే ను చీఫ్ కోచ్ నియామకంపై బిసిసిఐ ఆలోచిస్తుందట. ఇందుకు అతడు కూడా సుముఖంగానే వుండటంతో చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొనున్నట్లు తెలుస్తోంది.
undefined
వీరే కాకుండా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టన్, టామ్ మూడీలు కూడా టీమిండియా చీఫ్ కోచ్ పదవిపై కన్నేశారు. అయితే వీరికంటే పైన పేర్కొన్న ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ పదవిని చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
undefined
భారత జట్టు చీఫ్ కోచ్ ను నియమించే బాధ్యతను మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలోని కమిటీకి బిసిసిఐ అప్పగించింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అవసరమైతే వారితో ముఖాముఖీ సమావేశాలు జరిపి ఈ పదవికి అర్హత కలిగిన వ్యక్తిని ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. దీనికి బిసిసిఐ నుండి అంగీకారం లభిస్తే టీమిండియా నూతన కోచ్ ఎంపిక పూర్తవుతుంది.
undefined
click me!