గత ఏడాది ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మార్చిలో ఆఫ్ఘాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సింది టీమిండియా. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా అది వర్కవుట్ కాలేదు. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత జూన్‌లో ఆఫ్ఘాన్‌తో సిరీస్ జరగాల్సింది. టీమిండియా ప్లేయర్లు రెస్ట్ కోరుకోవడంతో ఈసారి కూడా అది వర్కవుట్ కాలేదు..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ ఆడాల్సింది టీమిండియా. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి దృష్టిలో పెట్టుకుని, టీమిండియా ప్లేయర్లకు ఏకంగా నెల రోజుల పాటు బ్రేక్ ఇచ్చింది బీసీసీఐ. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా వాయిదా పడిన ఆఫ్ఘాన్ సిరీస్‌ని వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తామని ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..
25
team india
2018లో టీమిండియా మీడియా బ్రాడ్‌కాస్టర్‌గా బాధ్యతలు తీసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కాంట్రాక్ట్, ఈ ఏడాది మార్చిలో ముగిసింది. జూన్‌లో జరగాల్సిన ఆఫ్గాన్ సిరీస్ వాయిదా పడడానికి మీడియా బ్రాడ్‌కాస్టర్ లేకపోవడం కూడా ఓ కారణం..
35
‘ఆస్ట్రేలియాతో ఆగస్టులో జరగాల్సిన వన్డే సిరీస్ సమయానికి మీడియా రైట్స్ ఢీల్ జరుగుతుంది. ఈసారి ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొనబోతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నాం. మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకోని ప్లేయర్లను ఏషియన్ గేమ్స్‌కి పంపిస్తాం..
45
Harmanpreet Kaur-Smriti Mandhana
క్రికెట్ అడ్వైసింగ్ కమిటీ ఆధ్వర్యంలో భారత మహిళా టీమ్ హెడ్ కోచ్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. అలాగే బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నాం. ఏషియన్ గేమ్స్‌లోపే కోచ్‌ల నియామకం జరుగుతుంది..
55
India vs Australia
వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ నిర్వహించడానికి అవకాశం లేదు. అందుకే వచ్చే జనవరిలో ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఉంటుంది. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఉంటుంది, వరల్డ్ కప్ తర్వాత టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీని దృష్టిలో ఉంచుకుని ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఉంటుంది.’ అంటూ తెలిపాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..