పంజాబ్‌లో పుట్టిన విక్రమ్‌జీత్ సింగ్, నెదర్లాండ్స్‌కి ఓపెనర్‌గా ఉన్నాడు. ఓమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 109 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలిచాడు విక్రమ్‌జీత్ సింగ్. అలాగే విజయవాడకి చెందిన తేజ నిడమనూరు కూడా నెదర్లాండ్స్‌కి మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉన్నాడు.